ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 డిశెంబరు 2022 (12:47 IST)

మన్మథుడు స్టార్ అక్షర గౌడ పుట్టినరోజు.. శుభాకాంక్షల వెల్లువ

Akshara Gowda
Akshara Gowda
భారతీయ చలనచిత్ర నటి, మోడల్ అయిన అక్షర గౌడ.. తమిళం, కన్నడ, తెలుగు, హిందీ భాషలలో ఆమె పలు సినిమాల్లో నటించింది. 24 డిసెంబర్ 1991న భారతదేశంలోని కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. అక్షర తన పాఠశాల విద్యను బెంగుళూరులోని న్యూ కేంబ్రిడ్జ్ హైస్కూల్‌లో ముగించింది. 
 
అలాగే బెంగళూరులోని విజయ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఆ తర్వాత బెంగళూరులోని శ్రీ కృష్ణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చేసింది.
 
2011లో, అక్షర 'ఉయర్తిరు 420' చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత విజయ్ నటించిన తమిళ తుపాకి సినిమాలో చిన్న పాత్ర చేసింది. 
 
2013లో అక్షర 'రంగేజ్' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తమిళ, కన్నడ సినిమాలతో పాటు మన్మథుడు 2లో, ది వారియర్ వంటి పలు చిత్రాలలో నటించింది. కాగా ఆమెకు నేడు పుట్టిన రోజు ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 
 
ఆమె రాశి- మకర రాశి 
అలవాట్లు - చదవడం, ట్రావెలింగ్, సినిమాలు చూడటం.