బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 జూన్ 2020 (09:57 IST)

ఫోర్బ్స్ జాబితాలో అక్షయ్ కుమార్‌కు చోటు- అమేజాన్ డీల్ కలిసొచ్చింది..

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌కు అరుదైన గౌరవం లభించింది. ప్రఖ్యాత ఫోర్బ్స్‌ పత్రిక విడుదల చేసిన ఈ జాబితాలో అక్షయ్ కుమార్ చోటు దక్కించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా సంపాదిస్తోన్న తొలి 100 సెలబ్రిటీల జాబితాలో బాలీవుడ్ హీరో అక్షయ్‌ కుమార్‌ 52వ స్థానంలో నిలిచారు. కాస్మెటిక్ రారాణి కైలీ జెన్నర్‌ ఆ జాబితాలో ఈ ఏడాది రూ. 4,453 కోట్లతో అగ్రస్థానంలో నిలిచారు.  
 
ఇక ప్రఖ్యాత ఫోర్బ్స్‌ పత్రిక విడుదల చేసిన ఈ జాబితాలో అక్షయ్ తప్ప మరే బాలీవుడ్‌ నటులు లేకపోవడం గమనార్హం. అక్షయ్‌ కుమార్‌తో అమేజాన్‌ ప్రైమ్‌ డిజిటల్‌ సిరీస్‌ కోసం రూ.75 కోట్లతో ఒప్పందం చేసుకోవడంతో ఈ ఏడాది ఆయన సంపాదనకు ఈ అంశం కలిసి వచ్చింది. 
 
ఈ జాబితాలో కైలీ జెన్నర్ తర్వాత వరుసగా కన్యే వెస్ట్‌, రోజర్‌ ఫెదరర్‌, క్రిస్టియనో రొనాల్డో చోటు సంపాదించుకున్నారు. గత ఏడాది జూన్‌ నుంచి ఈ ఏడాది మే వరకు అక్షయ్ కుమార్ రూ.366 కోట్లు సంపాదించారు. గత ఏడాది ఆయన ఆ జాబితాలో రూ.490 కోట్లతో 33వ స్థానంలో నిలిచారు.