గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 13 జులై 2024 (14:49 IST)

సరికొత్త ప్రేమకథా చిత్రంగా అలనాటి రామచంద్రుడు

Krishna Vamsi   Moksha
Krishna Vamsi Moksha
కృష్ణ వంశీ హీరోగా పరిచయం అవుతున్న సరికొత్త ప్రేమకథా చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స బ్యానర్ పై  హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. మోక్ష హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
 
తాజాగా మేకర్స్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ‘అలనాటి రామచంద్రుడు’ ఆగస్ట్ 2న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ సినిమాపై మంచి బజ్ ని క్రియేట్ చేశాయి.
 
ఈ మూవీలో సీనియర్ నటుడు బ్రహ్మాజీ, సీనియర్ నటి సుధ, ప్రమోదిన, వెంకటేష్ కాకమును, చైతన్య గరికిపాటి ఇతర ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.  
 
శశాంక్ తిరుపతి మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రానికి ప్రేమ్ సాగర్ కెమరామెన్,  జే సి శ్రీకర్ ఎడిటర్. 
 
నటీనటులు : కృష్ణ వంశీ, మోక్ష,  బ్రహ్మాజీ,  సుధ, ప్రమోదిని, కేశవ్ దీపక్ , వెంకటేష్ కాకుమాను, చైతన్య గరికిపాటి,  దివ్య శ్రీ గురుగుబెల్లి,  స్నేహమాధురి శర్మ తదతరులు