సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 18 మే 2022 (17:24 IST)

న‌న్ను పొలిటికల్‌ లీడర్‌గా క్రియేట్‌ చేయబోతున్నది వై.ఎస్‌. జ‌గ‌న్‌గారే - అలీ

Actor Ali
Actor Ali
న‌టుడు అలీ వైకాపా నాయ‌కుడు. వై.ఎస్‌. జ‌గ‌న్‌ను ప‌లుసార్లు క‌లిశాడు. ఆయ‌న‌కు రాజ్య‌స‌భ సీటు వ‌స్తుంద‌ని, లేదంటే వ‌క్ఫ్‌బోర్డ్ ప‌ద‌వి వ‌స్తుంద‌నీ, సినిమాటోగ్ర‌పీ మంత్రి ఇస్తార‌ని ర‌క‌ర‌కాలుగా వార్త‌లు వ‌చ్చాయి. ఆమ‌ధ్య అలీ త‌న కుటుంబంతో క‌లిసి వై.ఎస్‌.జ‌గ‌న్ ఇంటికి మ‌ర్యాద‌పూర్ంక‌గా క‌లిశారు కూడా. 
 
కాగా, నిన్న వై.ఎస్‌.జ‌గ‌న్ కొంత‌మందికి ప‌దవులు క‌ట్ట‌బెట్టారు. అందులో అలీ పేరు లేదు. ఈ విష‌య‌మై అలీని అడిగితే, నన్ను హీరోగా క్రియేట్‌ చేసింది ఎస్వీ కృష్ణారెడ్డి అయితే..పొలిటికల్‌ లీడర్‌గా క్రియేట్‌ చేయబోతున్నది సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిగారే.ఆయన నాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. నామీద నమ్మకం పెట్టుకోండి అన్నారు అంతే. ఏదో ఒకరోజు కాల్‌ వస్తే వెళ్తా.. మీ సమక్షంలోనే (మీడియా) ఆ విషయాన్ని పంచుకుంటా అని చెప్పారు.