అందుకోసమే అలియాను ఎంపిక చేశా.. రాజమౌళి క్లారిటీ
'బాహుబలి' చిత్రం తర్వాత దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం "రౌద్రం రణం రుధిరం" (ఆర్ఆర్ఆర్). ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్‌లు హీరోలు కాగా, ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
అయితే, ఈ చిత్రంలో మరో హీరోయిన్ ఎంపిక జరగాల్సివుంది. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్ నటిస్తుండగా, ఆయనకు భార్య పాత్రలో బాలీవుడ్ నటి అలియా భట్‌ను ఎంపిక చేశారు. సీత పాత్ర కోసం అలియానే ఎంచుకోవడానికి గల కారణమేంటనే విషయంపై తాజాగా క్లారిటీ ఇచ్చారు.
ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్స్ ముందు తన సత్తా చూపగల పవర్ ఫ్యాక్డ్ నటి కావాలని అందుకోసమే అలియాని సెలక్ట్ చేశామని చెప్పుకొచ్చారు. తనలోని అమయకత్వాన్ని పక్కన పెట్టి నటనతో ప్రేక్షకులని తప్పక మంత్రముగ్ధులని చేస్తుందని రాజమౌళి చెప్పుకొచ్చారు
కాగా, ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 8వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. కాని ప్రస్తుత పరిస్థితులని బట్టి చూస్తుంటే అనుకున్న సమయానికి "ఆర్ఆర్ఆర్" చిత్రం థియేటర్స్‌లోకి వస్తుందా అనే అభిప్రాయం జనాల మదిని తొలుస్తుంది.