సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 13 ఫిబ్రవరి 2021 (14:19 IST)

డిస్ట్రిబ్యూట‌ర్లంతా `విశాల్ చ‌క్ర‌`తో జాక్‌పాట్ కొడ‌తారుః విశాల్‌

Visal, meghana, Srinath, Srini, etc
యాక్ష‌న్ హీరో విశాల్ హీరోగా ఎంఎస్‌ ఆనందన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం `విశాల్ చ‌క్ర‌`. శ్రద్దా శ్రీనాథ్  హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఒక కీల‌క‌పాత్ర‌లో రెజీనా క‌సాండ్ర న‌టిస్తోంది. అత్యుత్తమ సాంకేతిక  ప్రమాణాలతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్‌ నిర్మిస్తున్నారు. ఇది హీరో విశాల్, మ్యూజిక్ డైరెక్ట‌ర్ యువ‌న్ శంక‌ర్‌రాజా కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న10వ చిత్రం కావ‌డం విశేషం. ఇప్పటికే విడుద‌ల చేసిన ట్రైల‌ర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 19న  ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతున్న‌ సంద‌ర్భంగా హైదారాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్‌లో `విశాల్ చ‌క్ర గ్రాండ్ ప్రీ రిలీజ్ఈవెంట్‌`ని నిర్వ‌హించింది చిత్ర యూనిట్‌. ఈ కార్య‌క్ర‌మంలో `విశాల్ చ‌క్ర` మూవీ బిగ్ టికెట్‌ని ఆవిష్క‌రించారు.
 
ఈ కార్య‌క్ర‌మంలో హీరో విశాల్ మాట్లాడుతూ ,  ``సాధార‌ణంగా నా సినిమా ఈవెంట్ అంటే చీఫ్ గెస్ట్‌ని పిలుస్తాను. ఇప్పుడు ఈ ఈవెంట్‌చూసి కూడా చాలా మంది నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి మాకు ముందే ఎందుకు చెప్ప‌లేదు అని అడుగుతారు. కాని ఈ `చ‌క్ర గ్రాండ్ ప్రీ రిలీజ్ఈవెంట్‌`కి మీడియానే చీఫ్ గెస్ట్‌.  విశాల్ `చ‌క్ర` సినిమా ఫిబ్ర‌వ‌రి 19న తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాల‌, క‌న్న‌డ భాష‌ల‌తో పాటు హిందీలో కూడా థియేట‌ర్స్‌లో విడుద‌ల‌వుతుంది. డిజిటల్ క్రైమ్స్ నేప‌థ్యంలో రూపొందిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది. ఎంఎస్ ఆనంద‌న్ ఎంతో హార్డ్ వ‌ర్క్ చేసి ఈ సినిమా తీశారు. త‌ప్ప‌కుండా ఆయ‌న‌కు బ్రైట్ ఫ్యూచ‌ర్ ఉంటుంది. మా విశాల్ ఫిలిం ఫ్యాక్ట‌రి బ్యాన‌ర్‌లో మ‌రో మంచి డైరెక్ట‌ర్‌ని ఇంట్ర‌డ్యూస్ చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఇక‌పై కూడా మా బేన‌ర్ ద్వారా మంచి డైరెక్ట‌ర్స్‌ని, టెక్నీషియ‌న్స్  ఇంట్ర‌డ్యూస్ చేస్తాం. నా త‌మ్ముడు యువ‌న్ శంక‌ర్ రాజా ఎక్ట్రార్డిన‌రీ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. నా త‌మ్ముడు వ‌రంగ‌ల్‌ శ్రీ‌ను స‌హా ఈ సినిమా డిస్ట్రిబ్యూట‌ర్స్ అందరూ  ఈ సినిమాతో త‌ప్ప‌కుండా ఒక జాక్ పాట్ కొడ‌తారు. ఫిబ్ర‌వ‌రి20న అంద‌రం హ్యాపీఫేస్‌తో మీట్ అవుతాం. నా స్నేహితులు హీరో ర‌మ‌ణ‌, నంద చాలా హెల్ప్ చేశారు. అలాగే  మా అన్న‌య్య బి.ఎ రాజుగారికి ద‌న్య‌వాదాలు. నా ప్ర‌తి సినిమాకి  ఆయ‌న సొంత‌ సినిమాలాగా అన్ని ద‌గ్గ‌రుండి చూసుకుంటారు. అలాగే చాలా మంది అడుగుతున్నారుస్ట్ర‌‌యిట్ తెలుగు సినిమా ఎప్పుడు చేస్తారు అని త‌ప్ప‌కుండా నెక్ట్స్ ఇయ‌ర్ ఉగాదికి  నా స్ట్ర‌యిట్ తెలుగు సినిమా విడుద‌ల‌వుతుంది`` అన్నారు.
 
చిత్ర ద‌ర్శ‌కుడు ఎంఎస్ ఆనంద‌న్ మాట్లాడుతూ -  ``ఎక్క‌డో ఉన్న న‌న్ను ఈ స్థాయికి విశాల్‌గారు తీసుకువ‌చ్చారు. ఈ సినిమా ఇంత గొప్ప‌గా వ‌చ్చిందంటే దానికి కార‌ణం విశాల్‌గారే. ఒక మంచి క‌థ‌కి ఎలాంటి టెక్నీషియ‌న్స్ తోడైతే ఒక డైరెక్ట‌ర్‌కి ‌ ఫ‌స్ట్ సినిమా ప్రాప‌ర్‌గా వ‌స్తుందో అలాంటి టెక్నీషియ‌న్స్ ని ఇచ్చారు విశాల్‌గారు. ఈ సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వ‌ర‌కూ ప్ర‌తి సీక్వెన్స్ చాలా ఎగ్జ‌యిటింగ్‌గా ఉంటుంది. అంద‌రూ టెక్నీషియ‌న్స్ క‌థ న‌చ్చి ఈ మూవీకి  చాలా క్రియేటివ్‌గా వ‌ర్క్ చేశారు. యువ‌న్ శంక‌ర్ రాజా గారు చాలా మంచి మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు.  ఈ సినిమా చూసి బ‌య‌ట‌కు వ‌చ్చే ప్ర‌తి ఆడియ‌న్ త‌ప్ప‌కుండా ఎగ్జ‌యిటింగ్‌గా ఫీల్ అవుతారు. న‌న్ను, నా క‌థ‌ని న‌మ్మి ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన విశాల్‌గారికి జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాను. నాకు తెలుగు సినిమా అన్నా.. తెలుగు భాష అన్నా   చాలా ఇష్టం. అలాగే రాజ‌మౌళిగారు అంటే చాలా ఇష్టం. సినిమాలు చూసే తెలుగు నేర్చుకున్నాను`` అన్నారు.
 
మిస్ ఇండియా ద‌ర్శ‌కుడు న‌రేంద్ర‌నాథ్ మాట్లాడుతూ - ``పందెంకోడి సినిమా నుండి నేను విశాల్ గారికి యూనిక్ ఫ్యాన్‌ని. ఆయ‌న‌ ఎప్పుడూ కొత్త కంటెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తుంటారు. ద‌ర్శ‌కుడు ఆనంద‌న్ ప్యాష‌న్ ఎంటో ట్రైల‌ర్ చూస్తేనే అర్ధం అవుతుంది. విజువ‌ల్స్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. ఈ సినిమా త‌ప్ప‌కుండా బ్లాక్‌బ‌స్ట‌ర్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.
 
ప‌వ‌న్‌తేజ్ కొణిదెల మాట్లాడుతూ  - ``విశాల్‌గారికి నేను చాలా పెద్ద అభిమానిని. ఆయ‌న సినిమాలు అన్ని చూశాను. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది`` అన్నారు.
 
మేఘ‌న మాట్లాడుతూ  -  ``విశాల్ గారు నా ఫేవ‌రెట్ యాక్ట‌ర్. ఆయ‌న ఎన్నో కంటెంట్ ఓరియెంటెడ్ ఫిలింస్ చేసి ఒక ట్రెండ్ సెట్ చేశారు. ఈ సినిమా కూడా త‌ప్ప‌కుండా ఆ మార్క్‌ని అందుకుంటుంద‌ని న‌మ్ముతున్నాను`` అన్నారు.
 
నైజాం డిస్ట్రిబ్యూట‌ర్ వ‌రంగ‌ల్ శ్రీ‌ను మాట్లాడుతూ  -  ``విశాల్ అన్న గురించి నేను చాలా సంద‌ర్భాల్లో చెప్పాను. నేను ట్రావెల్ చేసిన వ్య‌క్తుల్లో క‌ల్మ‌శంలేని వ్య‌క్తి  విశాల్ అన్న‌. ట్రైలర్ చూస్తుంటే ఒక స్పైసీ థ్రిల్ల‌ర్ మూవీ అనిపించింది. అలాగే ట్రెండ్ సెట్టింగ్ మూవీ అనిపించింది. ప్రొడ‌క్ష‌న్‌, మేకింగ్ వ్యాల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయి. ఫిబ్ర‌వ‌రి 19న గ్రాండ్‌గా రిలీజ‌వుతుంది. త‌ప్ప‌కుండా విశాల్ అన్నకెరీర్‌లో మంచి ఓపెనింగ్స్ సాధించి హైయెస్ట్ గ్రాస‌ర్‌గా నిలుస్తుంద‌ని న‌మ్మ‌కం ఉంది`` అన్నారు.
 
సీడెడ్ డిస్ట్రిబ్యూటర్‌ శోభ‌న్ త‌రుపున‌ న‌ర‌సింహ‌సాయి మాట్లాడుతూ  -  ``విశాల్‌గారు యాక్ష‌న్ హీరో, మాస్ హీరో మాకు మాత్రం సూప‌ర్ హీరో..విశాల్‌గారి సినిమాలంటే సీడెడ్ వ‌ర‌కూ ఎప్పుడూ హ్యాపీనే. ఎంత కాంపిటేష‌న్ ఉన్నా విశాల్ గారి మూవీ అంటే హ్యాపీగా కావాల్సిన‌న్ని థియేట‌ర్స్ ఇస్తారు. త‌ప్ప‌కుండా మంచి ఓపెనింగ్స్ వ‌స్తాయి. సినిమా సూప‌ర్‌హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.