గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 28 మే 2024 (16:30 IST)

రిక్షా మీద కూర్చుని సిగరెట్ తాగుతూ మాస్ పాత్రలో అల్లరి నరేష్ చిత్రం బచ్చల మల్లి

Bacchala Malli look
Bacchala Malli look
హీరో అల్లరి నరేష్ తన అప్ కమింగ్ మూవీ 'బచ్చల మల్లి'లో ఇంటెన్స్ రోల్ లో కనిపించబోతున్నారు. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ ఈరోజు విడుదల చేశారు.
 
అల్లరి నరేష్ మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో మ్యాసీ హెయిర్, గడ్డంతో కనిపించారు. నరేష్ ఇంటెన్స్ సీరియస్ లుక్ లో రిక్షా మీద కూర్చుని సిగరెట్ తాగుతూ కనిపించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో బాణసంచా కాల్చడం, ఫెరోషియస్ దేవుళ్ల గెటప్‌లతో కూడిన కార్నివాల్‌ను గమనించవచ్చు. హై-వోల్టేజ్ ఫైట్ సీక్వెన్స్‌లోని ఈ అద్భుతమైన ఫస్ట్‌లుక్ పోస్టర్, బచ్చల మల్లి ఇంటెన్స్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని సూచిస్తుంది.
 
ఈ చిత్రంలో అల్లరి నరేష్ సరసన అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తోంది. రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
 
గ్రాండ్ స్కేల్ లో రూపొందుతున్న బచ్చల మల్లిలో టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. సీతా రామం ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా, మానాడు, రంగం, మట్టి కుస్తి చిత్రాలకు పనిచేసిన రిచర్డ్ ఎం నాథన్ డివోపీగా పని చేస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్.
 
కథ, సంభాషణలు సుబ్బు స్వయంగా అందించగా, విప్పర్తి మధు స్క్రీన్‌ప్లే, ఎడిషనల్ స్క్రీన్‌ప్లే విశ్వనేత్ర అందించారు.
 
హీరో ఎమోషనల్ జర్నీ 1990 బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలో జరుగుతోంది. ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి.
 
తారాగణం: అల్లరి నరేష్, అమృత అయ్యర్, రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు.