గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 20 ఆగస్టు 2018 (12:13 IST)

'గీత గోవిందం' హీరో విజయ్‌ చాలా ముదురు... అల్లు అరవింద్

'గీత గోవిందం' హీరో విజయ్ దేవరకొండపై ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. విజయ్ దేవరకొండ చాలా ముదురు అంటూ స్టేజీపై నుంచి వ్యాఖ్యానించారు.

'గీత గోవిందం' హీరో విజయ్ దేవరకొండపై ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. విజయ్ దేవరకొండ చాలా ముదురు అంటూ స్టేజీపై నుంచి వ్యాఖ్యానించారు. దీంతో విజయ్‌తో పాటు మిగిలినవారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీన్ని గమనించిన అల్లు అరవింద్ ఆ తర్వాత తన వివరణ ఇచ్చారు. విజయ్ చాలా ముదురు అంటే.. తెలివైనవాడు అంటూ చెప్పుకొచ్చాడు.
 
విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా పరశురామ్‌ దర్శకత్వంలో బన్నీ వాస్‌ నిర్మించిన 'గీత గోవిందం' సక్సెస్‌మీట్‌ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో చిత్ర సమర్పకుడు అల్లు అరవింద్‌ మాట్లాడుతూ 'చిరంజీవిలాగానే విజయ్‌ దేవరకొండ కూడా ఎదుటి వ్యక్తి చెప్పేది విని ఆలోచిస్తాడు. విజయ్‌ చాలా ముదురు... అంటే తెలివైనోడు' అంటూ వ్యాఖ్యానించాడు. ఇక 'గీతగోవిందం' చిత్ర దర్శకుడు పరశురాం మాట్లాడుతూ, చిరంజీవి మాటలు తనకు భగవద్గీతతో సమానమని చెప్పుకొచ్చారు.