శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 మార్చి 2021 (15:24 IST)

తాజ్‌మహల్‌ను సందర్శించిన అల్లు అర్జున్, స్నేహారెడ్డి.. ఏంటి విశేషం..?

Bunny_Sneha
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహా రెడ్డి దంపతులకు శనివారం 10వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అల్లు అర్జున్ తన కెరీర్‌తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యం ఇస్తాడు. వీలు కుదిరినప్పుడల్లా కుటుంబంతో కలిసి విహార యాత్రలకు వెళుతుంటాడు. 2011 మార్చి 6వ తేదీన బన్నీ, స్నేహల వివాహం జరిగింది. నేటితో వారి వివాహ బంధానికి పదేళ్లు పూర్తయ్యాయి.
 
ఈ క్యూట్ కపుల్‌కు ఇద్దరు పిల్లలు (అయాన్‌, అర్హ) ఉన్నారు. బన్నీ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న `పుష్ప` సినిమాలో నటిస్తున్నాడు. ఇక వెడ్డింగ్ డే సందర్భంగా బన్నీ తన భార్య స్నేహతో కలిసి తాజ్‌మహల్ సందర్శనకు వెళ్లాడు. 
Sneha-Bunny
 
ప్రేమసౌధం ముందు తన భార్యతో కలిసి ఫొటోలు దిగాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. "మనకు 10వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు క్యూటీ. ఈ పది సంవత్సరాల ప్రయాణం ఎంతో అద్భుతంగా జరిగింది. ఇలాంటి వార్షికోత్సవాలు ఇంకెన్నో జరుపుకోవాలి" అని బన్నీ కామెంట్ చేశాడు.