బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 14 జూన్ 2017 (13:33 IST)

నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా అంటున్న దువ్వాడ జగన్నాథమ్

దువ్వాడ జగన్నాథమ్ సినిమా విడుదల కాకముందే... సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న నేపథ్యంలో.. బన్నీ తదుపరి సినిమాపై కన్నేశాడు. ఈ నెల 23న డీజే రిలీజ్‌కు రంగం సిద్ధమైన తరుణంలో ప్రముఖ సినీ రచయిత వక్కంతం వంశీ ద

దువ్వాడ జగన్నాథమ్ సినిమా విడుదల కాకముందే... సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న నేపథ్యంలో.. బన్నీ తదుపరి సినిమాపై కన్నేశాడు. ఈ నెల 23న డీజే రిలీజ్‌కు రంగం సిద్ధమైన తరుణంలో ప్రముఖ సినీ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ప్రారంభించాడు. ఈ మేరకు సినిమా షూటింగ్ బుధవారం ప్రారంభమైంది. ముహూర్తం సమయానికి అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో పాటు, ఈ సినిమా యూనిట్ పూజాకార్యక్రమాలు పూర్తి చేశారు.
 
పనిలో పనిగా సినిమా టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. నా పేరు సూర్య అనే టైటిల్ డీజే తదుపరి సినిమాకు ఖరారు కాగా, దీనికి ఉప శీర్షికగా నా ఇల్లు ఇండియా అనే దాన్ని జోడించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ సరసన నటించే హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదు. ఇతర నటీనటుల ఎంపిక జరగాల్సి వుంది. 
 
ఈ చిత్రానికి దర్శకుడిగా వక్కంతం వంశీ పరిచయం కానుండగా, సంగీతాన్ని బాలీవుడ్ సంగీత దర్శకులు విశాల్-శేఖర్ ద్వయం అందించనున్నారు. రామ లక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై శిరీషా శ్రీధర్ లగడపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సైనికుడి పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను అల్లు అర్జున్ ఫేస్ బుక్ పేజీ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇక ఈ చిత్రంలో తమిళ నటుడు శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.