బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 7 ఆగస్టు 2021 (14:38 IST)

మాస్క్ లేకుండా శాకుంత‌ల సెట్‌కు వెళ్ళిన అల్లు అర్జున్‌- గుణ‌శేఖ‌ర్ ప్ర‌శంస‌

Allu arjun family
అల్లు అర్జున్ ఆక‌స్మికంగా గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న `శాకుంత‌లం` చిత్రం సెట్‌కు శ‌నివారం సంద‌ర్శించారు. త‌న భార్య‌, కుమారుడితో క‌లిసి ఆయ‌న అన్న‌పూర్ణ ఏడెక‌రాల‌లోని షూటింగ్ జ‌రుగుతున్న ప్రాంతాన్ని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత నీలిమ‌, ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ వారిని సాద‌రంగా ఆహ్వానించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ త‌న‌య అల్లు అర్హా న‌టిస్తోంది. అర్హాపై తీస్తున్న స‌న్నివేశాల‌ను త‌న కుటుంబంతో ఆస‌క్తిగా అల్లు అర్జున్ వీక్షించారు.
 
Allu arjun family
కాగా, దుష్యంతుడు, శ‌కుంత‌ల క‌థ‌తో ఈ సినిమా రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. స‌మంత టైటిల్ పాత్ర పోషిస్తోంది. దుష్యంతుడిగా మ‌ల‌యాళ న‌టుడు దేవ్‌మోహన్ న‌టిస్తున్నాడు. ఇందులో కీల‌క పాత్ర అయిన ప్రిన్స్ భార‌త పాత్ర‌లో అర్హా న‌టిస్తోంది. త‌న కుమార్తె ఈ సినిమాలో న‌టించ‌డ‌ప‌ట్ల ఆయ‌న మొద‌ట్లోనే భావోద్వేగానికి గుర‌య్యారుకూడా. నేను స‌మంత‌తో వైవిధ్య‌మైన పాత్ర‌లో న‌టించాను. ఇప్పుడు నా కుమార్తె ఆమె సినిమాలో న‌టించ‌డం ఆనందంగా వుంది. ఈ అవ‌కాశం ఇచ్చిన నీలిమ‌కు, గుణ‌శేఖ‌ర్ ఆయ‌న కృత‌జ్ఞ‌తలు తెలిపారు.
 
ఈ సంద‌ర్భంగా అల్లు అర్జున్ అక్క‌డి ప‌నిచేసే సిబ్బందితో ఆప్యాయంగా ప‌లుక‌రించారు. కోవిడ్‌టైంలో మాస్క్‌లు ధ‌రించాల్సివుంది. కానీ కొద్దిసేపు అక్క‌డివారి కోరిక‌మేర‌కు మాస్క్ తీసి క‌నిపించారు. ఈ సంద‌ర్భంగా గుణ‌శేఖ‌ర్ ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.