శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 డిశెంబరు 2020 (17:27 IST)

అల వైకుంఠపురంలో.. నెట్‌ఫ్లిక్స్‌లో అగ్రస్థానం.. బన్నీ అదుర్స్ (Video)

''అల వైకుంఠపురంలో'' చిత్రానికి రికార్డులు వచ్చి చేరుతూనే వున్నాయి. ఈ ఏడాది ఈ సినిమా రికార్డుల వర్షం కురిపించింది. వసూళ్లలో రికార్డు, టీఆర్పీలో రాకార్డు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఈ ఏడాది వరుసగా ఈ సినిమా రికార్డులు చేస్తూనే ఉంది. 
 
తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన జాబితా ప్రకారం ఈ ఏడాది ఎక్కవగా వీక్షించబడిన దక్షిణ భారత సినిమాలలో ఈ సినిమా ప్రథమ స్థానంలో నిలుచుంది. ఈ విషయాన్ని స్వయంగా నెట్‌ఫ్లిక్సే ప్రకటించింది. దీంతో అల్లు అర్జున్ అభిమానుల ఆనండానికి హద్దులు లేకుండా పోయాయి. 
 
ఈ సినిమా మొదట థియేటర్లలో విడుదలైంది. తరువాత ఓటీటీలో కూడా విడులైంది. అయినప్పటికీ ఇన్ని రికార్డులు సాధించడం ఘనతనే చెప్పాలి. అంతేకాకుండా ఈ సినిమాతోనే పూజా హెగ్డేకు బుట్టబొమ్మ అనే పేరు కూడా వచ్చింది. కాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా అలా వైకుంఠపురములో సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.