అల్లు అర్జున్ ముంబై పర్యటన షారుఖ్‌ఖాన్ కోసమేనా!  
                                       
                  
                  				  ఇటీవలే అల్లు అర్జున్ ముంబై పర్యటన జవాన్ సినిమాలో అతిధి పాత్ర చేస్తున్నాడనే వార్త ఊహాగానాలకు ఆజ్యం పోసింది.  షారుఖ్‌ఖాన్ నటిస్తున్నజవాన్‌లో అల్లు అర్జున్ అతిథి పాత్రలో నటిస్తున్నారనే వార్తలు కొంతకాలంగా హల్‌చల్ చేస్తున్నాయి. చిత్రనిర్మాతలు దీని గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ, అల్లు అర్జున్ ఇటీవల ముంబై పర్యటన ఊహాగానాలకు ఆజ్యం పోసింది.
 				  											
																													
									  
	 
	తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రంలో షారుఖ్‌ఖాన్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. కాగా, పుష్ప 2  చిత్ర యూనిట్ దీనిపై అక్కడ ఓ మీడియా సంప్రదించినప్పుడు, "ఇది అస్సలు నిజం కాదు, అల్లు అర్జున్ జవాన్‌లో నటించడం లేదు" అని  చెప్పారట. 
				  
	 
	అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో ఓ యాక్షన్ ఎపిసోడ్ కోసం వచ్చాడని అంటున్నారు. పుష్ప ది రైజ్ లో అతను రోజువారీ కూలీగా మారిన గంధపు చెక్కల స్మగ్లర్.  పుష్ప రాజ్ అనే గ్యాంగ్‌స్టర్‌గా మారాడు. ఇప్పడు  పుష్ప: ది రూల్‌లో ఆ పాత్రను మళ్లీ పోషించనున్నాడు, దీని షూటింగ్ సుకుమార్ బిజీగా ఉండటంతో వాయిదా పడింది.