గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 3 ఫిబ్రవరి 2022 (16:31 IST)

ప్ర‌త్యేకంగా పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని క‌లిసిన అల్లు అర్జున్

Allu arjun at punneth house
పుష్ప విడుద‌లకుముందు చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా బెంగుళూరు వెళ్ళారు. కానీ అప్ప‌టికే పునీత్ రాజ్‌కుమార్ చ‌నిపోవ‌డంతో ఆయ‌న్ను క‌ల‌వాల‌ని కొంద‌రు సూచించారు. కానీ త‌న‌కు పునీత్ సోద‌రుడు లాంటివాడు. ఆయ‌న్ను వ్య‌క్తిగ‌తంగా క‌లుస్తాను. ఎటువంటి ప‌నులు లేకుండా కేవ‌లం ప్ర‌త్యేకంగా ఆయ‌న కోస‌మే వ‌స్తాను అంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు అదే అల్లు అర్జున్ నెర‌వేర్చాడు. ఇటీవ‌లే పునీత్ ఇంటికి వెళ్ళి ఆయ‌న ఫొటోకు పూల‌తో నివాళుల‌ర్పించారు.
 
ఈ సంద‌ర్భంగా పునీత్ సోదరుడు శివ రాజ్ కుమార్ వారి కుటుంబాన్ని వారి ఇంటికి వెళ్లి ప‌ల‌క‌రించారు. పునీత్‌తో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు అల్లు అర్జున్‌. గ‌తంలో త‌న సినిమా ప్ర‌మోష‌న్ సంద‌ర్భంగా హైద‌రాబాద్ వ‌చ్చిన‌ప్పుడు త‌న‌ను ప్ర‌త్యేకంగా పునీత్ క‌లిసిన విష‌యాన్ని శివారాజ్‌తో ప్ర‌స్తావించాడు. అదేవిధంగా పునీత్ సేవా కార్య‌క్ర‌మాల‌తో త‌నుకూడా కొన్ని ప‌నులు చేయ‌బోతున్న‌ట్లు చెప్పిన‌ట్లు స‌మాచారం.