గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 16 అక్టోబరు 2021 (15:56 IST)

మోహన్ బాబు నుంచి చాలా నేర్చుకున్నా - ఆయ‌న కోపం ఆయ‌న‌కే శ‌త్రువు- త‌ల‌సాని

Talasani- mohabbabu
మంచు మోహ‌న్‌బాబు గురించి న‌టుడిగా ఎవ‌ర్‌గ్రీన్ అని ఎవ‌రైనా చెబుతారు. కానీ వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న‌కు కోపం ఎక్కువ‌. అందుకే ఆయ‌న‌తో మాట్లాడాలంటే ఆచి తూచి మాట్లాడాల్సివ‌స్తుంది ఎంత‌టివారైనా. చిరంజీవి కూడా అందుకు మినహాయింపు కాదు. కానీ ఒక్కోసారి ఆయ‌న కోపం ఆయ‌న‌కే న‌ష్టం చేకూర్చింద‌ని మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ అంటున్నారు. 

 
శ‌నివారంనాడు అట్ట‌హాసంగా మంచు ఫ్యామిలీ తో విష్ణు ఫిలింన‌గ‌ర్ క‌ల్చ‌ర్ క్ల‌బ్‌లో ప్ర‌మాణ స్వీకారం చేశారు. త‌ల‌సాని స‌మ‌క్షంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి విష్ణు పేన‌ల్ అంతా హాజ‌ర‌య్యారు. వారితోపాటు మంచు అభిమానుల‌ు తండోప‌తండాలుగా వ‌చ్చి హాజ‌ర‌య్యారు. మంత్రి రాక‌తో పోలీసు బ‌ల‌గాలు బాగానే వున్నాయి. 

 
ఈ సంద‌ర్భంగా విష్ణు చేత ఎల‌క్ష‌న్ అధికారి ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. `మా`లో ర‌హ‌స్యాల‌ను చెప్ప‌కూడ‌నివి బ‌య‌ట ఎక్క‌డా చెప్ప‌న‌ని ప్ర‌మాణం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ,  “మా’కు ఎన్నికయిన సభ్యులకు నా అభినందనలు. ఇది ఎంతో సంతోషదాయకమై సందర్భం. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల స్థాయిలో ‘మా’ ఎన్నికలు జరిగాయి. ‘మా’ అసోషియేషన్ అంటే చిన్న అసోసియేషన్ కాదు. ‘మా’ అంటే పెద్ద వ్యవస్థ. మోహన్ బాబు మంచు విష్ణుకు చదువు, సంస్కారం, క్రమశిక్షణ ఇచ్చారు.


ఇండస్ట్రీలో మోహన్ బాబుకు కోపం, ఆవేశం ఎక్కువని అందరూ అనుకుంటారు. తప్పును తప్పు అని ధైర్యంగా మోహన్ బాబు చెబుతారు. మోహన్ బాబు నుంచి నేను చాలా నేర్చుకున్నాను. మోహన్ బాబు కోపం ఆయనికే నష్టం చేసింది, ఇతరులకు కాదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. మంత్రి మోహ‌న్ బాబు నుంచి ఏం నేర్చుకున్నాడనేది చెప్ప‌కుండానే విష్ణు ఏం నేర్చుకున్నాడో అదే తాను నేర్చుకున్న‌ట్లుగా వుంద‌ని ఆయ‌న మాట‌ల బ‌ట్టి అర్థ‌మైంది.