"ఏజెంట్"పై అమల స్పందన.. ట్రోల్స్ పట్టించుకోవద్దంటూ అఖిల్‌కు అడ్వైజ్
"ఏజెంట్" ద్వారా అఖిల్ అక్కినేని తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కానీ ఈసారి కూడా ఏజెంట్ అఖిల్‌కు ఆశించిన ఫలితం ఇస్తుందనే ఆశ నిరాశగా మారిపోయింది. భారీ అంచనాలతో ఈ సినిమా రిలీజ్ అయినప్పటికీ.. రిలీజ్ తర్వాత ప్రతిఒక్కరూ పెదవి విరుస్తున్నారు.
అఖిల్ ఫ్యాన్స్ అయితే సినిమా చూసి అసహనం వ్యక్తం చేస్తున్నారు. అఖిల్‌కి అభిమానిగా ఉండటం కష్టమైపోతుందని పలువురు ట్వీట్స్ కూడా చేశారు.
ఏజెంట్‌పై వస్తున్న ట్రోల్స్‌కి అఖిల్ తల్లి అమల స్పందించారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి అమల దగ్గరు చేరిందని, దీంతో ఆమె.. అక్కినేని ఫ్యాన్స్‌ను ఉద్దేశించి స్పందించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
"ట్రోలింగ్ మామూలే. ఏజెంట్ చూశాను. పూర్తిగా ఎంజాయ్ చేశాను. సినిమాలో లోపాలున్నాయి. కానీ ఓపెన్ మైండ్‌తో చూస్తే ఆశ్చర్యపోతారు. థియేటర్‌లో లేడీస్ చాలామంది ఈ సినిమా చూశారు. యాక్షన్ సీన్స్ టైంలో అరుస్తూ, కేకలేస్తూ వాళ్లు బాగానే ఎంజాయ్ చేశారు.
అఖిల్ తర్వాత చేయబోయే సినిమా చాలా బాగుంటుందని చెప్పగలను" అంటూ అమల చెప్పుకొచ్చారు. ఇంకా అఖిల్‌కు ట్రోల్ పట్టించుకోవద్దని అమల వెల్లడించారు.