శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 2 నవంబరు 2017 (11:32 IST)

పన్ను ఎగ్గొట్టలేదు... బోటు రైడ్‌కి వెళ్లాలనుకుంటున్నా... అమలాపాల్

పన్ను ఎగ్గొట్టిన కేసులో మలయాళ బ్యూటీ అమలాపాల్ తలతిక్కగా వ్యాఖ్యలు చేస్తోంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కారుకు రూ.20 లక్షల వరకు పన్ను చెల్లించలేదనే విమర్శలు గుప్పుమంటున్నాయి. వీటికి సరైన సమాధానం

పన్ను ఎగ్గొట్టిన కేసులో మలయాళ బ్యూటీ అమలాపాల్ తలతిక్కగా వ్యాఖ్యలు చేస్తోంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కారుకు రూ.20 లక్షల వరకు పన్ను చెల్లించలేదనే విమర్శలు గుప్పుమంటున్నాయి. వీటికి సరైన సమాధానం చెప్పాల్సిన అమలాపాల్.. తలతిక్క సమాధానానాలు, వ్యంగ్యాస్త్రాలను సంధిస్తోంది. 
 
పుదుచ్చేరికి చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి పేరుపై అమలాపాల్ లగ్జరీ బెంజ్ కారును దిగుమతి చేసుకుని, ఆ కారును పుదుచ్చేరిలో రిజిస్ట్రేషన్ చేయించారు. అలా చేయడం వల్ల ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.20 లక్షలు ఎగ్గొట్టినట్టయింది. దీంతో ఆమెపై చర్య తీసుకునేందుకు రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సిద్ధమవుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఆమె స్పందించారు. ఇదే అంశంపై ఆమె బుధవారం మధ్యాహ్నం ట్విట్టర్‌లో స్పందించాు. "బోటు రైడ్‌కి వెళ్లాలనుకుంటున్నా. చట్టాన్ని మీరినట్టు ఏమైనా ఆరోపణలు ఉన్నాయా? నా శ్రేయోభిలాషుల వద్ద ఒకటికి రెండు సార్లు చెక్‌ చేశాను" అని వ్యంగ్యాస్త్రం సంధిస్తూ తాను ఏ విషయంలోనూ చట్టాన్ని మీరలేదంటూ వ్యాఖ్యానించింది.