ఫోరెన్సిక్ సర్జెన్‌గా అమలాపాల్..

amala paul
Last Updated: మంగళవారం, 1 జనవరి 2019 (18:21 IST)
''మైనా'' సుందరి అమలాపాల్ తాజాగా ఫోరెన్సిర్ సర్జన్‌గా నటించనుంది. ప్రముఖ దర్శకుడు విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఆపై.. విడాకులు తీసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం నటనకు ప్రాధాన్యత వున్న పాత్రల్లో దూసుకుపోతుంది. 
 
అభిలాష్ పిళ్లై రచనలో అనూప్ ఫణికర్ దర్శకత్వం వహిస్తున్న ఫోరెన్సిక్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌లో అమలాపాల్ నటించనుంది. ఈ సినిమా షూటింగ్ చెన్నై, కోవై, కోయంబత్తూరు, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో జరుగనుందని సినీ వ‌ర్గాలు తెలిపాయి.
 
ఏజీ ఫిలింస్‌, వైట్‌ స్ర్కీన్‌ మీడియా బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ వచ్చే మార్చిలో ప్రారంభంకానుంద‌ని నిర్మాత‌లు వెల్లడించారు.దీనిపై మరింత చదవండి :