'బాహుబలి' రానా ఎక్కడ... ఎన్టీఆర్ బయోపిక్ 'బాబు' రానా ఎక్కడ?

బుధవారం, 12 సెప్టెంబరు 2018 (17:34 IST)

రానా.... పాత్ర డిమాండ్ మేరకు శక్తివంచన లేకుండా కృషి చేసే నటుల్లో ఒకరు. నిజానికి ఇంతగా రిస్క్ చేసి నటించేవారు చాలా కొద్దిమంది వుంటారు. అలాంటివారి జాబితాలో రానా చేరిపోయారు. బాహుబలి చిత్రంలో రానా కండలు తిరిగి, ఆతడిని చూస్తేనే జడుసుకునేలా బాడీని పెంచి హడలెత్తించాడు. బాహుబలిలో రానా ఫిజిక్ చూసినవారు అదిరిపోయారు. వామ్మో... రానా ఇలా ఎలా మారిపోయారంటూ మాట్లాడుకున్నారు. బాహుబలిలో భళ్లాలదేవ అంటే భయంతో చిన్నపిల్లలు కూడా వణికిపోయారంటే అతిశయోక్తి కాదు. 
 
ఇక ఇప్పటి సంగతి చూస్తే... ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రను పోషించేందుకు ఆయన ఫిజిక్ మాదిరిగా మారేందుకు రానా చాలా తంటాలు పడ్డారని తాజాగా బయటకి వచ్చిన లుక్ చూస్తే తెలిసిపోతోంది. బక్కపలచగా అచ్చం చంద్రబాబు నాయుడు పర్సనాలిటీతో రానా కనిపిస్తున్నారు. ఈ లుక్ చూసిన నెటిజన్స్ రానాకు హ్యాట్సాఫ్ అంటున్నారు. రానా అంటే రానానే...

ఎన్టీఆర్‌లో అచ్చం చంద్రబాబులానే రానా

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. హీరో బాలకృష్ణ ...

అదో వేశ్యావాటిక... 2 వేల మంది అమ్మాయిలు... 6 రౌండ్లు...

అమ్మాయిల అక్రమ రవాణా, అభంశుభం తెలియని ఆడపిల్లలను సంపన్నుల సుఖాలు తీర్చే బానిసలుగా ...

అర‌వింద స‌మేత ఆడియో క్యాన్సిల్... ప్రి రిలీజ్ ఫంక్ష‌న్‌కి చంద్రబాబు, బాలయ్య

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో ...

ఏం చేయను.. బ్రేకప్ జరిగిన విషయం నిజమే... రష్మిక మందన్న

గీత గోవిందం హీరోయిన్ రష్మిక మందన్నకు కన్నడ నిర్మాత, హీరో రక్షిత్ శెట్టితో జరిగిన ...