శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 9 మే 2017 (09:14 IST)

బాహుబలి-2ని బీట్ చేయాలనుకుని బొక్క బోర్లా పడ్డ అమీర్ ఖాన్.. చైనాలో దంగల్ కలెక్షన్లు ఫట్

ఇంతవరకు ఇండియన్ హైయస్ట్ గ్రాసర్ మూవీస్‌లో అమీర్ ఖాన్ నటించిన పీకే మూవీనే పైన ఉండేది. ఫస్ట్ ప్లేస్‌లో కూర్చున్న అమిర్ ఖాన్‌ని ఒక్క దెబ్బతో ప్రభాస్ సెకండ్ ప్లేస్‌కి దింపేశాడు. ఇటీవలే బాహుబలి వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్‌ను క్రాస్ చేసింది. అమీర్ ఖాన్ నట

బాలీవుడ్ మిస్టర్ ఫర్పెక్ట్ అమీర్ ఖాన్‌కు ఉన్నట్లుండి మన టాలీవుడ్‌ మిస్టర్ ఫర్పెక్ట్ ప్రభాస్‌‌ను చూసి అసూయ కలుగుతోందా అంటే సమాధానం అవుననే వస్తోంది. ఎందుకంటే జీవితకాలం తాను కష్టపడి సాధించిన ఫిల్మ్ రికార్డులన్నింటినీ బాహుబలి-2 ఊచకోత కోస్తుండటమేనట. ఇంతవరకు ఇండియన్ హైయస్ట్ గ్రాసర్ మూవీస్‌లో అమీర్ ఖాన్ నటించిన పీకే మూవీనే పైన ఉండేది. ఫస్ట్ ప్లేస్‌లో కూర్చున్న అమిర్ ఖాన్‌ని ఒక్క దెబ్బతో ప్రభాస్ సెకండ్ ప్లేస్‌కి దింపేశాడు. ఇటీవలే బాహుబలి వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్‌ను క్రాస్ చేసింది. అమీర్ ఖాన్ నటించిన పీకే ఫుల్ రన్ టైమ్‌లో ప్రపంచ వ్యాప్తంగా 792 కోట్ల రూపాయలు సాధించి అక్కడే ఆగిపోయింది.


బాహుబలి దెబ్బతో ఖంగుతిన్న అమీర్ ఖాన్ ఎలాగైనా సరే  వెయ్యి కోట్ల రూపాయల క్లబ్‌లో చేరాలని బలంగా అనుకుంటున్నట్లు  వినికిడి. అందుకే భారీ హిట్‌గా నిలిచిన దంగల్ సినిమాను చైనాలో 9 వేల థియేటర్లలో ఈ మధ్యే విడుదల చేయించాడు. బాహుబలి -2 మూవీ ప్రపంచమంతటా కలిసి 9 వేల థియేటర్లలో విడుదల అయితే దంగల్ సినిమాను కేవలం చైనాలనే 9 వేల థియేటర్లలో విడుదల చేశారు. అంటే బాహుబలి కలెక్షన్స్ అమీర్ ఖాన్‌ని బాగా భయపెడుతున్నాయి.  
 
భారతీయ సినీరంగంలో ప్రత్యేకించి బాలీవుడ్‌లో రికార్డులపై అమీర్ ఖాన్‌కున్న పిచ్చి అంతా ఇంతా కాదని అందరికీ తెలిసిన విషయమే. బాలీవుడ్‌లో మొదటి వంద కోట్ల రూపాయలు సినిమా కూడా అమీర్ ఖాన్‌దే. ఈ రికార్డుల లొల్లి మొదలు పెట్టంది కూడా అమీర్ ఖానే. ఈ నేపథ్యంలో ఉన్నట్లుండి ఒక టాలీవుడ్ హీరో అన్ని రికార్డులను బ్రేక్ చేసి ఫస్ట్ ప్లేస్‌లో కూర్చున్నాడంటేనే అమీర్ ఖాన్ స్థానంలో ఎవరున్నా అసూయే కలుగుతుంది. 
 
అందుకే దంగల్ సినిమాను చైనాలో భారీగా విడుదల చేసి బాహుబలి-2 ని కలెక్షన్ల పరంగా  బీట్ చేయాలని అమీర్ బాగా కలకన్నాడు. దీంట్లో భాగంగానే గత శుక్రవారం చైనాలో 9 వేల థియేటర్లలో రిలీచ్ చేయించిన అమీర్ శుక్ర, శని, ఆది వారాలు  మూడు  రోజుల్లో చైనా దంగల్ విరగదీస్తుందని ఆశించాడు. తన మూవీని చైనావాళ్లు ఎగబడి చూస్తారని అనుకున్నాడు అమీర్. అయితే చైనాలో తొలి మూడు రోజులు కలిపి దంగల్ కేవలం 50 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసి అమీర్ ఖాన్‌ను ఖంగుతినిపించింది. 
 
9 వేల థియేటర్లలో 3 రోజులు 50 కోట్లు మాత్రమే వచ్చిందంటే మామూలు విషయం కాదు. ఏ తెలుగు సినిమా అయినా 3 లేక 4 వేల థియేటర్లలో విడుదల చేస్తే మూడు రోజులకు 50 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుంది. అలాంటిది అమీర్ ఖాన్ చైనాలో దంగల్‌ను 9 వేల థియేటర్లలో విడుదల చేసినా తొలి వారాంతపు మూడు రోజుల్లో 50 కోట్లు మాత్రమే వసూలు చేసిందంటే ఏరకంగా చూసినా చాలాచాలా తక్కువ మొత్తమే మరి. 
 
అంటే బాహుబలి-2ని పోటీగా తీసుకుని దంగల్ ద్వారా చైనా కలెక్షన్లతో ముందుకు దూసుకుపోవాలని భావించిన అమీర్ ఖాన్ పెద్ద తప్పే చేశాడని మూవీ విశ్లేషకులు భావిస్తున్నారు.