శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 15 మే 2023 (15:49 IST)

షూటింగ్ స్పాట్‌కు బైకుపై వెళ్లిన అమితాబ్

amitabh
నిరాడంబరంగా ఉండే సినీ తారల్లో అమితాబ్ బచ్చన్ ముందు వరుసలో ఉంటారు. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో ఆయన చాలా సింపుల్‌గా ఉంటూ ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించారు. తాజాగా ఆయన మరోమారు సామాన్యుడి తరహాలో బైకుపై షూటింగ్ స్పాట్‌కు వెళుతూ ముంబై వీధుల్లో కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
తనకు లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తికి థ్యాంక్స్ చెబుతూ బిగ్ బీ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. "నువ్వు ఎవరో నాకు తెలియదు. కానీ సమయానికి నన్ను షూటింగ్  జరిగే ప్రదేశానికి తీసుకెళ్లావు. ట్రాఫిక్‌లో చిక్కుకుపోకుండా సాయం చేశావు. అంటూ అతడికి ధన్యవాదాలు" అని చెప్పారు. దీనిపై నెటిజన్లు తమకు తోచిన విధంగా స్పందిస్తున్నారు. అతడెవరో చాలా అదృష్టవంతుడు అంటూ ఓ యూజర్ కామెంట్స్ చేయగా, మీరు నిజంగానే మెగాస్టార్ అని మరొకరు అన్నారు.