1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : సోమవారం, 31 ఆగస్టు 2015 (19:24 IST)

హ్యాకర్ల చేతికి అబితాబ్ ట్విట్టర్...

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన ట్విట్టర్‌ను ఎవరో హ్యాకింగ్ చేసినట్టు తెలిపారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. అందులో తన ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ చేయబడిందని తెలిపారు. తన ట్విట్టర్ పేజీలో తాను పోస్ట్ చేసినవి మాత్రమే కాకుండా అదనంగా, తనకు సంబంధం లేని అంశాలను ఎవరో పోస్ట్ చేశారని తెలిపారు. అయితే ఈ హ్యాకింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఏవీ తెలియరాలేదు. 
 
కాగా అమితాబ్ ట్విట్టర్‌ ఖాతాకు గత ఏడాది కాలంగా ఒక కోటి 66 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. వారిలో ప్రధాని నరేంద్ర మోడీ, క్రికెట్ స్టార్ సచిన్ టెండూల్కర్‌లతో పాటు అనేక మంది సెలిబ్రిటీలు అమితాబ్ ఫాలోవర్లుగా ఉన్నారు. ఈ విధంగా తన ట్విట్టర్ ఖాతా హ్యికింగ్ చేయడంపై అమితాబ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.