శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

కోడలిని అన్‌‍ఫాలో చేసిన బిగ్ బీ.. ఎందుకు? వారిద్దరూ విడిపోతున్నారా?

amitabh - aishwarya Rai
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్... తన కోడలు ఐశ్వర్యా రాయ్ బచ్చన్‌ను ఇన్‌స్టా ఖాతాను అన్‌ఫాలో అయ్యారు. ఈ వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది. బిగ్ బీ మొత్తం 74 మంది సెలెబ్రెటీలు ఫాలో అవుతున్నారు. వీరిలో సల్మాన్ ఖాన్, అభిషేక్ బచ్చన్, కత్రినా కైఫ్ వంటి అనేక సినీ ప్రముఖులు ఉన్నారు. అయితే, ఈ జాబితాలో ఐశ్వర్య కనిపించకపోవడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
అమితాబ్ మనవడు అగస్త్య నంద నటించిన "ది ఆర్చీస్" ఇటీవలే విడుదలైంది. ముంబైలో ప్రదర్శించిన ఈ చిత్రం ప్రీమియర్‌కు అమితాబ్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. అమితాబ్, ఐశ్వర్య ఇలా అందరూ సంతోషంగా కెమెరాలకు ఫోజులు కూడా ఇచ్చారు. ఇంతవరకు బాగనే ఉంది. 
 
ఆ తర్వాత కోడలు ఐశ్వర్య రాయ్ బచ్చన్‌ను మామ అమితాబ్ బచ్చన్ అన్‌ఫోలో కావడమే ప్రతి ఒక్కరికీ అంతు చిక్కడం లేదు. అమితాబ్ ఇన్‌స్టా ఖాతా అకౌంట్ సెట్టింగ్స్ కారణంగా ఆయన ఎవరినీ ఫాలో అవుతుందీ బహిరంగంగా తెలియకపోవచ్చని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ కథనం అభిమానుల్లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ పెను చర్చకుదారితీసింది. దీంతో అభిషేక్ - ఐశ్వర్య రాయ్ బచ్చన్‌లు విడిపోనున్నారని వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి.