ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 23 జూన్ 2021 (16:01 IST)

ఫిలింఛాంబర్లో ఆనందయ్య మందు పంపిణీ

Chamber team
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వ‌ర్యంలో నెల్లూరు ఆనంద‌య్య మందు పంపిణీ బుధ‌వారంనాడు జ‌రిగింది. గౌరవ కార్యదర్శి కె.ఎల్.దమోదర్ ప్రసాద్, ప్రొడ్యూసర్ సెక్టార్ కౌన్సిల్ చైర్మన్ ఏలూరు సురేందర్ రెడ్డి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్ ఇసనాకా సునీల్ రెడ్డి, ఫిల్మ్ ప్రొడ్యూసర్ వీరి ఆధ్వర్యంలో ఫిలిం ఛాంబర్ 4 సెక్టార్స్ ప్రొడ్యూసర్స్ & మెంబెర్స్, సిబ్బంది, మీడియా మిత్రులకు ఆనందయ్య మందు పంపిణీ చేయడం జరిగింది
 
ఈ సందర్భంగా సునీల్  రెడ్డి మాట్లాడుతూ, మాది నెల్లూరు కావడమే కాక ఆనందయ్యతో నాకు మంచి పరిచయం వుంది. ఫిల్మ్ ఛాంబర్ కోరిక మేర‌కు మందు పంపిణీ చేస్తే బాగుంటుందని కొంతమంది నిర్మాతలు తెలపడంతో ఈ ఆనందయ్య మందును అందిస్తున్నాం. ఈ మందును  ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ముందు  ఒక బఠాని గింజంత వేసుకోవాలి. అలాగే రాత్రి భోజనం చేసే ముందు ఒక బఠాని గింజంత వేసుకోవాలి. ఒక రెండు రోజుల వరకు కూడా గుడ్డు, నాన్వెజ్, ఆల్కహాల్ వంటివి తీసుకోకూడదు. ఇది కరోనా రాని వాళ్లకు మాత్రమే. కరోనా వచ్చి పోయిన వారు కూడా ఈ మందు వేసుకోవచ్చు. కరోనా రాకుండా కూడా ఈ మందు వేసుకోవచ్చు. అలాగే కరోనాతో బాధ పడుతున్న వారు  మాత్రం ఈ మందు వాడకూడదు. వ్యాక్సిన్ వేసుకున్న వారు మాత్రం వారం తర్వాత ఈ మందు వేసుకోవచ్చు. ఈ మందు వలన ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవు. ఈ మందును సుమారు 500 మంది నుంచి 700 మంది వరకు ఈ మందు సరఫరా చేస్తున్నాం. దాము గారు, సురేందర్ రెడ్డి గారు, ప్రసన్న కుమార్ గాని ఇంకా ఏదైనా అవసరం ఉంటే నాకు రెండు రోజులు ముందు తెలియజేస్తే నేను వారికి ఎంత అవసరం ఉందో అంత క్వాలిటీ తీసుకొచ్చి అందించ డానికి సిద్ధంగా ఉన్నాను. ఇండస్ట్రీ అంతా ఆరోగ్యంగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో నా వంతు ఇలాంటి మంచు కార్యక్రమం చేస్తున్నానని అన్నారు.
 
ఛాంబ‌ర్‌ గౌరవ కార్యదర్శి దాము మాట్లాడుతూ, ఈ మందు వాడినా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని తెలుకోవడమే కాకుండా క్రాస్ చెక్ చేసుకొన్న తరువాత తగిన తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మందులు వాడాలని సూచించడం జరిగింది. అలాగే ఈ కవర్లో దానికి సంబంధించిన ఒక పాంప్లెట్ ఉంది. ఆ పాంప్లెట్ ని ఫాలో అయి మీరందరూ వాడతారని ఆశిస్తున్నాను. ఈ మందును అందరూ తమ ఐడీ కార్డు చూపించి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం .దీనికి సంబంధించి ఇంకేమి కావాలన్నా సురేందర్ రెడ్డి గారిని కలిస్తే ఆయన పూర్తి వివరాలు మీకు అందజేస్తారని అన్నారు.
నిర్మాత సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, దీనిపైన మీకు ఏ విధమైన స‌మాచారం కావాలనే నన్ను సంప్రదించగలరని తెలిపారు.