బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 3 ఆగస్టు 2024 (13:05 IST)

పొట్టేల్ లో రూరల్ ట్రెడిషనల్ లుక్ లో అనన్య నాగళ్ల

Ananya Nagalla
Ananya Nagalla
యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న'పొట్టేల్' రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఫ్రెష్ అండ్ హానెస్ట్ నొవల్ కాన్సెప్ట్ మూవీ. ఇప్పటివరకు విడుదలైన కంటెంట్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాలోని ఇప్పటిదాకా విడుదలైన 4 పాటలు చార్ట్ బస్టర్ హిట్స్ గా అలరిస్తున్నాయి. 
 
అనన్య నాగళ్ల బర్త్ డే సందర్భంగా మేకర్స్ స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో అనన్య రూరల్ ట్రెడిషనల్ లుక్ లో చాలా నేచురల్ గా కనిపించారు. ఇందులో పెర్ఫార్మెన్స్ కి స్కోప్ వున్న క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. బుజ్జమ్మగా అనన్య క్యారెక్టర్ ఎక్స్ ట్రార్డినరీగా వుండబోతోంది. అజయ్ ఒక పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నారు. ఆయన క్యారెక్టర్ టెర్రిఫిక్ గా ఉండబోతోంది. 
 
ఈ చిత్రాన్ని నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ మోనిష్ భూపతి రాజు, ఎడిటింగ్ కార్తీక శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్షన్ నార్ని శ్రీనివాస్.
 
త్వరలోనే ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.  
 
నటీనటులు: యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్