గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 19 మార్చి 2021 (09:45 IST)

డ్యాన్సుతో ఇరగదీసిన అనసూయ.. జివ్వుమని కొండగాలి పాటకు..? (video)

యాంకర్ అనసూయ యాంకరింగ్‌తో పాటు యాక్టింగ్‌లోనూ అదరగొడుతోంది. సినిమాల్లోనూ ఆయనకు తగిన పాత్రలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రతివారం గురువారం ప్రసారమయ్యే జబర్ధస్త్ ఎపిపోడ్‌లో యాంకర్ అనసూయ ఏదో ఒక పాటకు చిందేస్తూ జబర్ధస్త్ కామెడీ షోను స్టార్ట్ చేస్తూ ఉంటుంది.

జబర్దస్త్‌లో ఆయన యాంకరింగ్‌కు డ్రెస్సింగ్‌కు మాంచి ఫాలోయింగే వుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి పాటకు ఓ రేంజ్‌లో చిందేలిసేసిన అనసూయ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఇకపోతే.. అందులో భాగంగా క్షణం, ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకుంది ఈ జబర్దస్త్ యాంకర్. తాజాగా ఈ భామ.. ఈ వారం మెగాస్టార్ చిరంజీవి, రాధ హీరో హీరోయిన్లుగా దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన 'లంకేశ్వరుడు' సినిమాలోని జివ్వుమని కొండగాలి పాటకు అనసూయ ఓ రేంజ్‌లో చిందులు వేసింది. 

 
 
రాజ్ కోటి స్వరకల్పనలో జబర్ధస్త్ జడ్జ్ మనో (నాగూర్ బాబు), జానకి పాటకు ఓ రేంజ్‌లో చిందులు వేసింది. దాసరి నారాయణరావు 100వ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ సినిమాలోని పాటలన్ని సూపర్ హిట్ అయ్యాయి. ఇపుడా పాటకు అనసూయ వేసిన చిందులు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఈమె మెగాస్టార్ హీరోగా నటిస్తోన్న 'ఆచార్య'లో కీ రోల్ పోషిస్తోంది.