శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డివి
Last Modified: గురువారం, 24 డిశెంబరు 2020 (18:14 IST)

మ‌హేష్ బాబు లాంచ్ చేసిన అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, అశ్విన్ విరాజ్ మూవీ 'థ్యాంక్ యు బ్ర‌ద‌ర్' మోష‌న్ పోస్ట‌ర్‌

చిత్ర‌సీమ‌లోని పెద్ద‌ల స‌పోర్ట్ ల‌భించ‌డం 'థ్యాంక్ యు బ్ర‌ద‌ర్' టీమ్‌కు ద‌క్కిన అదృష్టం. ఇదివ‌ర‌కు టైటిల్ పోస్ట‌ర్‌ను ప్ర‌భాస్‌, రానా రిలీజ్ చేయ‌గా, క్యాస్ట్ రివీల్ పోస్ట‌ర్‌ను సాయిధ‌ర‌మ్ తేజ్ ఆవిష్క‌రించారు. ఆ రెండు పోస్ట‌ర్ల‌కు ఆడియెన్స్ నుంచి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది.
 
లేటెస్ట్‌గా గురువారం (డిసెంబ‌ర్ 24) సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు 'థ్యాంక్ యు బ్ర‌ద‌ర్' మోష‌న్ పోస్ట‌ర్‌ను లాంచ్ చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు చెప్పారు. త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా మోష‌న్ పోస్ట‌ర్‌ను షేర్ చేసిన ఆయ‌న‌, "థ్యాంక్ యు బ్ర‌ద‌ర్ అఫిషియ‌ల్ మోష‌న్ పోస్ట‌ర్‌ను ప్రెజెంట్ చేయ‌డం హ్యాపీగా ఉంది. ఈ మోష‌న్ పోస్ట‌ర్ చూడ్డానికి థ్రిల్లింగ్‌గా ఉంది! భారీ విజ‌యం ద‌క్కాల‌ని మొత్తం టీమ్‌ను విష్ చేస్తున్నా" అని తెలిపారు.
 
ఈ మోష‌న్ పోస్టర్ ప్ర‌కారం ప్రియ అనే ప్రెగ్నెంట్ లేడీగా అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, అభి అనే మిలియ‌నీర్ ప్లేబాయ్‌గా అశ్విన్ విరాజ్ క‌నిపిస్తున్నారు. లాక్‌డౌన్ అనంత‌రం ఏర్ప‌డిన ఓ అసాధార‌ణ‌ ప‌రిస్థితిలో.. ఆ ఇద్ద‌రూ ఓ లిఫ్ట్‌లో చిక్కుకుపోయి స‌హాయం కోసం అర్ధిస్తున్నారు. ఈ మోష‌న్ పోస్ట‌ర్‌తో 'థ్యాంక్ యు బ్ర‌ద‌ర్‌'పై ఆస‌క్తి, అంచ‌నాలు బాగా పెరిగాయి. ఉత్కంఠ‌భ‌రిత అంశాల‌తో ఒక డ్రామా ఫిల్మ్‌గా 'థ్యాంక్ యు బ్ర‌ద‌ర్‌'ను నూత‌న ద‌ర్శ‌కుడు ర‌మేష్ రాప‌ర్తి రూపొందిస్తున్నారు.
 
జ‌స్ట్ ఆర్డిన‌రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై మాగుంట శ‌ర‌త్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న 'థ్యాంక్ యు బ్ర‌ద‌ర్'.. ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌ను బ‌ట్టి చూస్తుంటే అసాధార‌ణ చిత్రంగా అనిపిస్తోంది. సురేష్ ర‌గుతు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తుండ‌గా, గుణ బాల‌సుబ్ర‌మ‌ణియ‌న్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. షూటింగ్ పూర్త‌యిన 'థ్యాంక్ యు బ‌ద్ర‌ర్' చిత్రానికి సంబంధించి ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తున్నారు.
 
తారాగ‌ణం:
అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, అశ్విన్ విరాజ్‌, వైవా హ‌ర్ష‌, అర్చ‌నా అనంత్‌, అనీష్ కురువిల్లా, మౌనికా రెడ్డి, ఆద‌ర్శ్ బాల‌కృష్ణ‌, కాదంబ‌రి కిర‌ణ్‌, అన్న‌పూర్ణ‌, బాబీ రాఘ‌వేంద్ర‌, స‌మీర్‌
సాంకేతిక బృందం:
డైరెక్ట‌ర్‌: ర‌మేష్ రాప‌ర్తి
నిర్మాత‌లు: మాగుంట శ‌ర‌త్‌చంద్రా రెడ్డి, తార‌క్‌నాథ్ బొమ్మిరెడ్డి
బ్యాన‌ర్‌: జ‌స్ట్ ఆర్డిన‌రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
సినిమాటోగ్ర‌ఫీ: సురేష్ ర‌గుతు
ఆర్ట్‌: పురుషోత్తం ప్రేమ్‌
మ్యూజిక్‌: గుణ బాల‌సుబ్ర‌మ‌ణియ‌న్‌
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్