శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 10 ఫిబ్రవరి 2016 (16:07 IST)

గ్లామర్ షోపై నెటిజన్ల విమర్శలు: అనసూయ ఫైర్.. నేను నా భర్త ఏం చేసినా..?

టీవీ యాంకర్ నుంచి నటిగా ఎదిగి సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో నటించిన అనసూయకు నెటిజన్లపై కోపమొచ్చింది. నోటికొచ్చినట్లు వాగడం.. ఆ విమర్శలను నెట్లో పోస్ట్ చేయడాన్ని అనసూయ ఖండించింది. యాంకర్ నుంచి యాక్టర్‌ వరకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ ఉంది.

అలాగే అనసూయపై విమర్శలు చేసే వాళ్లు సైతం ఎక్కువవుతున్నారు. ముఖ్యంగా అనసూయ డ్రస్సింగ్ విషయంలో నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విమర్శలు చేసే వాళ్లు ఎక్కువయ్యారు. అమ్మ అయ్యాక కూడా పద్ధతిగా ఉండకుండా గ్లామర్ షో చేస్తోందని విమర్శలకు.. అనసూయ స్వయంగా సమాధానం ఇచ్చింది.
 
మీరంతా మీ జీవితాల్లో విసుగెత్తిపోయివుంటారని.. అందుకే తన డ్రెస్సింగ్ విషయంలో ఆరోపణలు చేస్తున్నారని నెటిజన్లకు షాక్ ఇచ్చింది. అవతలి వాళ్ల జీవితాల గురించి ఆలోచించే బదులు.. ఆ  సమయాన్ని మీకోసం వెచ్చిస్తే మీరు ఈ పాటికే సక్సస్ అయ్యేవాళ్లని గుర్తు పెట్టుకోండి. నేను నా భర్త ఏం చేసినా మా బతుకుల కోసమే. సినిమాలో ఉన్నందున అలాంటి డ్రెస్‌లు తప్పనిసరి. అయితే అదంతా ప్రొఫెషన్ మాత్రమే.
 
ఇక్కడితో ఆగకుండా.. ఒక వేళ తను చేసే పనులు నచ్చకపోతే పక్కన పెట్టేయండి అంతే కానీ.. ఆరోపణలు చేయడం సరికాదని నెటిజన్లకు హితవు పలికింది.  ఇలా ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేయడమంటే.. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని సరిగా పెంచలేదన్న మాట నిజమవుతుందని ఘాటుగా స్పందించింది. మీ బెటర్ మెంట్ కోసం ప్రార్థిస్తానని తెలిపింది.