Widgets Magazine Widgets Magazine

బాత్‌రూమ్‌ సింగర్‌ నుంచి స్టూడియో సింగర్‌గా... యాంకర్ సుమ

గురువారం, 16 ఫిబ్రవరి 2017 (22:00 IST)

Widgets Magazine

''నేను అందరిలాగానే బాత్‌రూమ్‌లో పాటలు పాడతాను. కానీ స్టూడియో సింగర్‌గా అవుతానని అస్సలు అనుకోలేదు. నా వృత్తి యాంకరింగ్‌. ఇకముందు గాయనిగా కొనసాగాలని అనుకోవడంలేదని'' ప్రముఖ యాంకర్‌ సుమ తెలియజేశారు. సాయిధరమ్‌ తేజ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటించిన 'విన్నర్‌'లో ఆమె అనసూయ కోసం ఓ పాట పాడింది. ఆ పాట సోషల్‌ మీడియాలోనూ బయట శ్రోతలను అలరిస్తోంది. ఈ సందర్భంగా సుమ, అనసూయలు తమ మనోగతాలను వివరించారు.
anchor suma
 
అనసూయపై పాట పాడటం నాకే ఆశ్చర్యంగా వుంది. చాలాసార్లు పాటను విని.. నేనే పాడానా! లేదా! అనే అనుమానం కూడా కల్గింది. తమన్‌ ఓ రోజు ఫోన్‌ చేసి పాట పాడాలి అన్నారు. జోక్‌ చేస్తున్నారేమో అనిపించింది. లేదు.. నిజమే చెబుతున్నానంటూ మరుసటి రోజు చెన్నై వచ్చేయమన్నారు. ఈ విషయం విన్న రాజీవ్‌ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తదుపరి రోజు చెన్నైలోని స్టూడియోకు వెళ్ళగానే చరణం చూపించారు. 'సూయ సూయ అనసూయ..' అనే పాట అది. ఇదేంటి అనసూయమీద పాటలా వుందే అన్నాను. 
 
అవును.. దీన్ని రామజోగయ్యశాస్త్రి రాశారు. దీన్నే మీరు పాడాలి అన్నారు. ఈ పాట పాడిన తర్వాత రోజు అనిరుధ్‌ విడుదల చేశారు. ఈ పాట విన్న చోటా కె.నాయడు ప్రశసించడం.. ఆదిత్య మ్యూజిక్‌ వారు బాగుందని మెచ్చుకోవడం కొత్తగా అనిపించింది.
 
సింగర్స్‌ ప్రతిస్పందన
నేను వీణ నేర్చుకున్నాను. ఆడియో ఫంక్షన్‌లో అప్పుడప్పుడు గొంతు సవరణ చేసుకుంటాను. అలా నా వాయిస్‌లో బేస్‌ వచ్చేసింది. నా గొంతులోని ఎనర్జీ తమన్‌ గారికి నచ్చి పిలిపించారని చెప్పారు. నేను బాత్‌‌రూమ్‌ సింగర్‌నే. అందరి అమ్మాయిల్లా పాడేదాన్ని. కానీ స్టూడియో సింగర్‌గా మారతానని అనుకోలేదు. టీవీ షో 'అంత్యాక్షరి'లో కూనిరాగాలు చేశాను.
 
'సూపర్‌ సింగర్‌'కు యాంకరింగ్‌ చేశాను. ఇప్పుడు గాయనిగా మారాను. అయితే బాలుగారితో కలిపి సింగర్స్‌ గ్రూప్‌లో నేనూ వున్నాను. 'స్వరాభిషేకం' నుంచి ఆ గ్రూప్‌లో వున్నాను. అందులో యాంకర్‌గా నేనే మిగిలాను. విన్నర్‌ సినిమాతో గాయనిగా మారాను. ఈ పాటను  బాలు గారికి పంపించాను. తమన్‌, కంప్యూటర్‌ సాయంతో పాడాను.. అని మెసేజ్‌ చేశాను. 
 
వెంటనే.. ఆయన. చాలా బాగుంది.. ఇట్‌ ఈజ్‌ నైస్‌.. అని మెసేజ్‌ పెట్టారు. ఇంకొందరు చిన్న స్మైల్‌తో పాడాల్సింది అని కూడా సూచించారు. ఏదిఏమైనా తొలిసారిగా ఆదిత్య ఆడియోలో సుమ కనకాల పేరు రావడం థ్రిల్‌ కల్గించింది. యాంకరింగే నా వృత్తి. పాటల్లోకి వెళ్ళాలనుకోలేదు. ఇప్పుడున్న సింగర్స్‌ చాలా ప్రతిభగలవారు. ఏదైనా ఏడాదికి ఒకసారి వస్తే పాడతాను. బాలుగారికి నా యాంకరింగ్‌ ఇష్టం. నా నుంచి పాట ఆశించరు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆడది ఐటమా! అనసూయ ప్రశ్న

మహిళను ఐటం అంటారెందుకు. అదేమైనా వస్తువా.. నేను డాన్స్‌ చేస్తే ఐటం సాంగ్‌ చేశారని ప్రచారం ...

news

'కాటమరాయుడు' మళ్లీ కదిలాడు...

పవన్‌ కళ్యాణ్‌ 'కాటమరాయుడు' చిత్రం చిత్రీకరణలో వుండగానే విదేశాలకు వెళ్ళాడు. దాంతో ...

news

రెండు రోజులు ఓపిక పట్టమంటున్న అర్జున్‌

రెండు రోజులు ఆగండి.. కావలసినంత కిక్‌ ఇస్తానంటున్నాడు అల్లు అర్జున్‌. ఆయన నటిస్తున్న ...

news

అమ్మో.. అమీ జాక్సన్ వేలంటైన్స్ డే ఇలా జరుపుకుందా... హవ్వ..!!

ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ ...