ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 జూన్ 2022 (19:31 IST)

అరబిక్ పాటకు న్యూయార్క్ వీధుల్లో స్టెప్పులేసిన యాంకర్ సుమ (Video)

Suma
Suma
యాంకర్ సుమ ప్రస్తుతం అమెరికాలో బిజీ బిజీగా వుంది. గత కొన్ని రోజుల నుంచి న్యూయార్క్‌లో జరిగిన తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం వారు నిర్వహిస్తున్న కార్యక్రమానికి హోస్ట్‌గా వెళ్లారు.
 
ఇక ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించి వారి సత్కారాన్ని కూడా సుమ తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం పూర్తిగా అయినప్పటికీ సుమ తన టీంతో కలిసి న్యూయార్క్ వీధులలో చక్కర్లు కొడుతూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.
 
ఈ క్రమంలోనే తాజాగా ఈమె న్యూయార్క్ రోడ్లపై డాన్స్ రీల్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
 
తాజాగా విజయ్ పూజా హెగ్డే నటించిన సినిమాలోని అరబిక్ కు ఈ పాటకు డాన్స్ చేసిన వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.