ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: మంగళవారం, 12 జనవరి 2021 (18:05 IST)

ఆ మాట చెప్పలేనన్న అనిల్ రావిపూడి, చేతులెత్తి దణ్ణం పెట్టిన మోనాల్ గజ్జర్

మోనాల్ గురించి చెప్పనవసరం లేదుగా. బిగ్ బాస్ షోలో ఆమె సందడి అంతా ఇంతా కాదు కదా. బిగ్ బాస్ చాలామందికి ఛాన్సులు వచ్చేలా చేస్తే అందులో మోనాల్ కూడా ఒకరు. స్పెషల్ సాంగ్స్‌లో మోనాల్ ప్రస్తుతం చేస్తున్న హడావిడి మామూలుగా లేదు. బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ సినిమాలోను ఒక పాటలో నర్తించింది మోనాల్.
 
ఆ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో దర్సకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా వచ్చాడు. ఆ ఫంక్షన్లో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆయన. బెల్లంకొండ శ్రీనివాస్ కష్టపడి పనిచేసే హీరో. ఇక నభా నటేష్.. ఆమె తన చేతికి గాయమైనా డెడికేషన్‌తో పనిచేసింది. సినిమాను పూర్తి చేసింది.
 
ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సింది మోనాల్. ఆమె మంచి పాటకు డ్యాన్స్ వేసింది. అయితే నేను ఆమె గురించి రెండు మాటలే చెప్పగలను. మూడో మాట చెప్పలేను... చెబితే అంటూ ఆమె వైపు చూశాడు. దీంతో రెండు చేతులు ఎత్తి దణ్ణం పెట్టేసింది మోనాల్. అప్పటికే ఇక ప్రేక్షకులకు అర్థమై పోయింది.
 
మోనాల్ బిగ్ బాస్ షోలో ఏడుపు ముఖం పెట్టడం.. ప్రతిదానికి ఏడ్చేయడంతో నాగార్జున ఆమెకు నర్మద అనే పేరు పెట్టాడు. ఎప్పుడూ ఏడుస్తూ ఉంటుందన్న ఉద్దేశంతో అనిల్ రావిపూడి ఆమెను చూస్తూ ఆ డైలాగ్ చెప్పాడట. ఫంక్షన్లో అనిల్ ఆ మాట చెప్పడంతో గాలి తీసేసినంత పనైందట మోనాల్‌కు.