సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 17 జూన్ 2024 (18:28 IST)

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

Anjali  bahishkarana
Anjali bahishkarana
యాబైకి పైగా చిత్రాల్లో ఎన్నో హీరోయిన్‌గా, ప్రధాన పాత్రల్లో మెప్పించిన నటి అంజలి. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో ZEE 5, ఫిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందుతోన్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. ముఖేష్ ప్రజాపతి ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్‌లో రూపొందుతోన్న ఈ సిరీస్‌లో 6 ఎపిసోడ్స్ ఉంటాయి. అంజలి పుట్టినరోజు సందర్భంగా ‘బహిష్కరణ’ మోషన్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
 
మోషన్ పోస్టర్‌ను గమనిస్తే.. అంజలి చేతిలో వేట కొడవలి పట్టుకుని కోపంగా కూర్చుంది.. ఆమె పక్కన్న ఓ చెక్క కుర్చీ మంటల్లో కాలిపోతుంది. మరోసారి అంజలి మరో విలక్షణమైన పాత్రలో ఇన్‌టెన్స్ క్యారెక్టర్‌తో ‘బహిష్కరణ’ వెబ్ సిరీస్‌లో మెప్పించనుందని తెలుస్తోంది. అంజలి ప్రధాన పాత్రలో నటిస్తోన్నఈ సిరీస్‌లో రవీంద్ర విజయ్, శ్రీతేజ్, అనన్య నాగళ్ల, షణ్ముక్, చైతన్య సాగిరాజు, మహ్మద్ బాషా, బేబీ చైత్ర ఇతర పాత్రల్లో మెప్పించనున్నారు.
 
 ఫిక్సల్ పిక్చర్స్ బ్యానర్‌పై  ప్రశాంతి మలిశెట్టి నిర్మిస్తోన్న ‘బహిష్కరణ’ సిరీస్ త్వరలోనే  ZEE 5 ద్వారా ప్రేక్షకులను మెప్పించనుంది. ఈ సిరీస్‌కు ప్రసన్నకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా సిద్ధార్థ్ సదాశివుని సంగీతాన్ని సమకూరుస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.  ‘బహిష్కరణ’ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆడియెన్స్‌ను త్వరలోనే అలరించనుంది.