శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 29 అక్టోబరు 2015 (13:16 IST)

పురుష ద్వేషిగా, బందిపోటుగా అంజలి: శంకరాభరణంలో ఛాలెంజింగ్ రోల్

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి ప్రస్తుతం రూటు మార్చింది. హీరోయిన్‌గా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూనే.. వైవిధ్య పాత్రల్ని కూడా చేసుకుంటూ పోతోంది. గీతాంజలి సినిమా ద్వారా విభిన్న పాత్రల్లో నటిస్తున్న అంజలికి కొత్త ఛాలెంజింగ్ రోల్ చేసే ఛాన్సొచ్చింది. పాత్రల విషయంలో కొత్తదనం కోసం ప్రయత్నించే అంజలి, 'శంకరాభరణం' సినిమాలోనూ ఒక విభిన్నమైన పాత్రను పోషించింది. ఈ సినిమాలో ఆమె బందిపోటుగా కనిపించనుంది.
 
పురుష ద్వేషిగా.. వాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించే బందిపోటుగా ఆమె పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుందట. అంతేకాదు, ఈ సినిమాలో ఆమె గెటప్ కూడా సెక్సీగా ఉంటుందని టాలీవుడ్ టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పాత్ర తనకు మంచి గుర్తింపు సంపాదించిపెడుతుందని కూడా అంజలి చెప్తోంది.