శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 10 ఏప్రియల్ 2017 (07:28 IST)

వీళ్లిద్దరూ మహాముదుర్లు.. ప్రేమ కాదు సహజీవనమేనట

మరో దక్షిణాది జంట ప్రేమ నుంచి సహజీవనం వరకు వెళ్లిపోయినట్లే అని రూఢి అవుతోంది. ఎవరి సినిమాలు వారు చేసుకుంటూనే గుట్టుగా ప్రేమాయణం నడుపుతున్న అంజలి, జై ఈ మధ్య బహిరంగంగానే తమ మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని ఆన్‌లైన్ సాక్షిగా ప్రకటించేశారు.

మరో దక్షిణాది జంట ప్రేమ నుంచి సహజీవనం వరకు వెళ్లిపోయినట్లే అని రూఢి అవుతోంది. ఎవరి సినిమాలు వారు చేసుకుంటూనే గుట్టుగా ప్రేమాయణం నడుపుతున్న అంజలి, జై ఈ మధ్య బహిరంగంగానే తమ మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని ఆన్‌లైన్ సాక్షిగా ప్రకటించేశారు. ఇటీవలే జై తన ప్రియురాలికి స్వయంగా కమ్మని దోసెలు చేసి పెట్టి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరీ ఎంత ఘాటు ప్రేమయో అనేలా ప్రపంచం ముందు బయటపడిపోయారు.
 
చాలా కాలం తర్వాత అంజలి, జై బెలూన్ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్యే ఈ సినిమాలో తన షూటింగ్ పార్ట్‌ను ముగించుకుని అంజలి మరో తెలుగు చిత్రం షూటింగుకు వెళ్లిపోయారు. అయితే ఇటీవల బెలూన్ చిత్ర షూటింగ్ స్పాట్‌లో నటుడు జై తనపుట్టిన రోజు వేడుకను జరుపుకుంటే అంజలి ఉన్నట్లుండి ఆ వేడుకకు వచ్చి జైకి స్వీట్ పెయిన్ కలిగించారు అంజలి. 
 
అంతటితో ఆగితేనా..  జైతో సన్నిహితంగా ఉన్న ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి మరీ ఆమె జైకి పుట్టిని రోజు శుభాకాంక్షలు అందించారు. మీ మనోభావాలు నెరవేరాలని ఆకాంక్షిస్తున్నాను. ఎప్పటిలాగే ప్రేమ కలిగిన వారిగానే ఉండండి..  అని అంజలి సుతిమెత్తని వార్నింగ్ కూడా ఇచ్చేశారు.
 
ఇదంతా చూస్తుంటే సినీ హీరోయిన్లు తమకు నచ్చిన హీరోల పట్ల గాఢానుబంధాన్ని పెంచుకుంటున్నట్లు కనబడుతోంది. ఇటీవలే సమంత కూడా నాగ్ చైతన్యను ఉద్దేశించి ట్వీట్ చేస్తూ ఎప్పటికీ నువ్వే నన్ను కాపాడుతూ ఉండాలి అంటూ సందేశమిచ్చిన విషయం తెలిసిందే..