సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 7 సెప్టెంబరు 2017 (17:56 IST)

బిచ్చగాడితో అంజలి రొమాన్స్..

బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీతో, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఫేమ్ అంజలి నటించనుంది. తమిళ, తెలుగు భాషల్లో క్రేజ్ తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ ప్రస్తుతం కాళి అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అతని సర

బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీతో, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఫేమ్ అంజలి నటించనుంది. తమిళ, తెలుగు భాషల్లో క్రేజ్ తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ ప్రస్తుతం కాళి అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అతని సరసన నలుగురు హీరోయిన్లు వుంటారు. ఆ నలుగురిలో అంజలి కూడా ఓ హీరోయిన్‌గా నటించనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. 
 
మిగిలిన హీరోయిన్లలో సునైన, అమృత, శిల్పా మంజూనాథ్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి కృతికా ఉదయనిధి దర్శకత్వం వహిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకునే ఈ సినిమాను డిసెంబరులో విడుదల చేయనున్నారు. ఇప్పటికే అవకాశాల్లేక ఇబ్బంది పడుతున్న అంజలి ఆంటోనీ సరసన నటించే అవకాశం రావడంతో ఎగిరి గంతేసింది. బిచ్చగాడు హీరోతో కలిసి నటిస్తే తనకు మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్సుందని భావిస్తోంది.