సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 21 మార్చి 2022 (13:27 IST)

మ‌రో ఆర్‌.ఆర్‌.ఆర్‌. వుంటుంద‌న్న రాజ‌మౌళి

Gujarath-RRR team
సినిమారంగంలో ఇప్పుడు ఆర్‌.ఆర్‌.ఆర్‌. గురించే ఎక్క‌డ చూసినా చ‌ర్చ‌. ఈ నెల 25న విడుద‌ల‌వుతుంది. కాబ‌ట్టి ఇత‌ర సినిమాలు ఏమీ విడుద‌ల చేయ‌డానికి సాహ‌సించ‌డంలేదు. పూర్తిగా ఈ సినిమా ప్ర‌మోష‌న్‌తో రాజ‌మౌళి బిజీగా వున్నాడు. నేడు గుజరాత్ ప‌ర్య‌టించి అక్క‌డ మోడీ ఆధ్వ‌ర్యంలో రూపొందిన స్టాచ్యు ఆఫ్ లిబ‌ర్టీ ద‌గ్గ‌ర చేరుకుని అక్క‌డ మీడియాతోనూ మాట్లాడారు.

 
హైద‌రాబాద్‌లో మీడియాతో మాట్లాడిన‌ప్పుడు ఆర్‌.ఆర్‌.ఆర్‌. త‌ర‌హాలో మ‌రో సినిమా చేస్తారా! అంటే.. లేద‌ని ముక్త‌స‌రిగా చెప్పాడు. కానీ త‌న తండ్రి పుట్టిన క‌ర్నాట‌క‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయ‌న ఈ విష‌యంపై మ‌రోర‌కంగా స్పందించారు.

 
రామ్‌చ‌ర‌ణ్, ఎన్‌.టి.ఆర్‌. అంటే మైత్రీ సంగ‌మం. మెగా అభిమానులు బంగాళాఖాతంతో పోల్చారు. నంద‌మూరి అభిమానులు అరేబియా స‌ముంద్రం లాంటివారు. నాకు నా కుటుంబ స‌భ్యుల‌కంటే అసిస్టెంట్ ద‌ర్శ‌కులంటే ఇష్టం. అందుకే నా నుంచి మ‌రో త్రిబుల్ ఆర్‌ వుంటుంది. అది కూడా అసిస్టెంట్ ద‌ర్శ‌కులు న‌టించి చూపిస్తార‌ని అన్నారు.


స‌హ‌జంగా సినిమా త‌ర్వాత మేకింగ్ వీడియో విడుద‌ల చేస్తుంటారు. అలాగే మ‌రో త్రిబుల్ ఆర్‌ అంటూ త‌న అసిస్టెంట్ల‌తో చేయించి వీడియో విడుద‌ల చేస్తార‌న్న‌మాట‌. అది చాలా ఫ‌న్నీగా వుంటుంద‌ని అన్నారు.