శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : సోమవారం, 29 జూన్ 2015 (14:02 IST)

మళ్లీ బరువెక్కనున్న అనుష్క... సూర్య సరసన చేరడానికే...

కోలీవుడ్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం 'సింగం-3'. ఈ చిత్రంలో కూడా సూర్య సరసన అనుష్కనే నటిస్తోంది. సింగం తొలి రెండు భాగాల్లో ప్రేమికులుగా నటించిన సూర్య, అనుష్క జంట సింగం-3లో దంపతులుగా కనిపించనున్నారట. వారికి పిల్లలు కూడా ఉంటారని తెలుస్తోంది. దీంతో గృహిణి పాత్రకు తగ్గట్టుగా అనుష్కను కొంచెం బరువు పెరగాలని చిత్ర దర్శకుడు హరి సూచించారట.
 
గత ఏడాది 'రుద్రమదేవి', 'బాహుబలి' చిత్రాల కోసం సన్నబడిన అనుష్క ఆ తర్వాత ఆర్య సరసన 'సైజ్‌ జీరో'లో నటించేందుకు బాగా బొద్దుగా తయారైంది. అయితే ఆ చిత్రంలో మరో పాత్రలో సన్నగా కనిపించాల్సి రావడంతో అనుష్క మళ్లీ సన్నగా మారింది. ఈ స్థితిలో సింగం-3 కోసం అనుష్క మళ్లీ బబ్లీగా మారాల్సి వస్తోంది. అయితే ప్రస్తుతం 'సైజ్ జీరో' చిత్ర షూటింగ్ చివరి దశలో ఉండడంతో తన పార్ట్ షూటింగ్ ముగిసిన తర్వాత మళ్లీ బరువెక్కేందుకు అనుష్క ప్లాన్ చేసినట్టు సమాచారం.