శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 8 మార్చి 2023 (20:14 IST)

మహిళా దినోత్సవం సందర్భంగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి నుండి అనుష్క కొత్త పోస్టర్

Anuksha latest
Anuksha latest
స్వీటీ బ్యూటీ అనుష్క శెట్టి, నవీన పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రానికి పి. మహేష్‌ కుమార్ దర్శకుడు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ మూవీ టైటిల్ లుక్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి మహిళా దినోత్సవం సందర్భంగా అనుష్క శెట్టి కొత్త పోస్టర్ ను విడుదల చేసింది మూవీ టీమ్. ఈ పోస్టర్ లో అనుష్క చాలా అందంగా కనిపిస్తోంది.

విదేశీ లొకేషన్ లో ఓ బిజీ రోడ్ తనదైన శైలిలో నవ్వుతూ రోడ్ దాటుతున్నట్టుగా ఉంది అనుష్క. హ్యాండ్ బ్యాగ్, ఫుల్ డ్రెస్ లో తన లుక్ కూడా చాలా హాట్ గా ఉంది. క్యాజువల్ అవుట్ ఫిట్ అయినా తన పర్సనాలిటీకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోన్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి సిద్ధు అనే స్టాండప్ కమెడియన్ గా, అనుష్క అన్విత రవళిశెట్టి అనే చెఫ్‌ పాత్రలో నటించారు. ఫస్ట్ లుక్ తో అంచనాలు పెంచిన ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయబోతున్నారు. ఆసక్తికరమైన కలయికలో రాబోతోన్న ఈ చిత్రానికి సంగీతంః రధన్, సినిమాటోగ్రఫీః నీరవ్ షా, ఎడిటర్ః కోటగిరి వెంకటేశ్వరరావు, పిఆర్.వోః జి.ఎస్.కె మీడియా, నిర్మాణ సంస్థః యూవీ క్రియేషన్స్, నిర్మాతలుః వంశీ - ప్రమోద్, రచన, దర్శకత్వంః పి. మహేష్‌ కుమార్.