శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 28 జులై 2015 (16:32 IST)

'ఏబీజె అబ్దుల్ కలాం ఆజాద్' అంటూ అనుష్క శర్మ ట్వీట్... పేరు కూడా గుర్తులేదా...?

ఇదివరకు తమ మనసులోని మాటను చెప్పాలంటే పెన్నూ, పేపరు తీసుకుని రాయాల్సిన పరిస్థితి. కొన్నాళ్లకు ఫోన్లు వచ్చాక ఆ పరిస్థితి కొంత తగ్గింది. ఇప్పుడు మైక్రోబ్లాగింగ్ సైట్లు అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీలు రెచ్చిపోతున్నారు. ఐతే కొందరు తెలిసీ తెలియన విషయాలను ఈ సైట్లలో అప్ చేసి ఆశ్చర్యపరుస్తున్నారు. 
 
ఇపుడీ కోవలో బాలీవుడ్ బ్యూటీ, విరాట్ కోహ్లి ప్రేయసి అయిన అనుష్క శర్మ చేరిపోయింది. ఇంతకీ విషయం ఏంటయా అంటే... అబ్దుల్ కలాం కన్నుమూసిన సందర్భంలో అనుష్క శర్మ ట్విట్టర్లో ట్వీట్ చేసింది. అందులో ఏమిని రాసి ఉన్నదంటే... ఏబీజె అబ్దుల్ కలాం ఆజాద్ గారికి నా నివాళులు అని. దీనిపై పుంఖానుపంఖాలుగా ట్వీట్లు వస్తుండటంతో ఆ పోస్టును డిలిట్ చేసేసిందట. మళ్లీ కొత్తగా మరో వ్యాఖ్యను పోస్ట్ చేసిందట.