మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 6 మార్చి 2020 (14:57 IST)

అనుష్క శెట్టి నిశ్శబ్దం ట్రెయిలర్ టాక్... ఎలా వుంది?

నిశ్శబ్దంలో స్టిల్
బాహుబలి తర్వాత భాగమతితో అనుష్క శెట్టి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత ఆమె నటించిన చిత్రం నిశ్శబ్దం. ఈ చిత్రం ట్రెయిలర్ కొద్దిసేపటికి క్రితం విడుదల చేశారు. ఇందులో అనుష్క శెట్టి మూగ యువతిగా కనిపిస్తోంది. ట్రైలర్ ప్రారంభంలో ఓ విదేశీ యువతి వార్తలు చదువుతున్నట్లు చూపించారు. ఆ తర్వాత ఓ ఇంట్లోకి వెళ్లిన అనుష్కపై ఎవరో దాడి చేస్తారు. 
 
దాడిలో గాయపడ్డ ఆమెను ఆసుపత్రికి తీసుకుని వెళ్తారు. ఈ క్రమంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంజలి, అనుష్క నుంచి వివరాలను రాబట్టేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ సీన్లన్నీ సస్పెన్సుగా వున్నాయి. 
 
ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న అనుష్క నిశ్శబ్దం ట్రెయిలర్ ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగానే వుందన్న టాక్ వినిపిస్తోంది. మరి చిత్రం ఎలా వుంటుందో చూడాల్సిందే.