శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 27 డిశెంబరు 2016 (11:28 IST)

పెళ్లి వయస్సు వచ్చింది.. కానీ, తగ్గ వరుడు తారసపడలేదు : అనుష్క

టాలీవుడ్ అగ్రనటి అనుష్క. వైవిధ్యమైన పాత్రలతో సిల్వర్ స్క్రీన్‌పై చెరగని ముద్ర వేసుకుంది. కేవలం ప్రేమ, యాక్షన్ భరిత కథా చిత్రాలలోనే కాక ఇటు చారిత్రాత్మక చిత్రాలు అటు భక్తిరస చిత్రాలలోను నటిస్తూ ప్రశంసల

టాలీవుడ్ అగ్రనటి అనుష్క. వైవిధ్యమైన పాత్రలతో సిల్వర్ స్క్రీన్‌పై చెరగని ముద్ర వేసుకుంది. కేవలం ప్రేమ, యాక్షన్ భరిత కథా చిత్రాలలోనే కాక ఇటు చారిత్రాత్మక చిత్రాలు అటు భక్తిరస చిత్రాలలోను నటిస్తూ ప్రశంసలు అందుకొంటోంది. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూనే మరోవైపు గ్లామరస్ పాత్రలూ చేస్తోంది. 
 
గతంలో 'అరుంధతి'లో జేజమ్మగా...'రుద్రమదేవి'లో రాణి రుద్రమ్మగా..'బాహుబలి'లో దేవసేనగా ఆకట్టుకుంది. ఈమె వివాహంపై సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి. వివాహం జరిగిందని.. ఓ పారిశ్రామిక వేత్తతో నిశ్చితార్థం జరిగిందని పుకార్లు షికార్లు చేశాయి. 
 
ఈ పుకార్లపై అనుష్క స్పందించింది. నా పెళ్లి గురించి రోజుకో రీతిలో వస్తున్న వార్తలు గురించి విని నవ్వుకోవడం మినహా ఏం చేయలని చెప్పింది. అయితే, తనకు పెళ్లి వయస్సు మాత్రం వచ్చిందని.. కానీ తగ్గ వరుడు ఇంతవరకు తారసపడలేదని తెలిపింది. 
 
'పెళ్లి మనం అనుకున్నప్పుడు జరగదు.. ఆ ఘడియలు రావాలి.. అప్పుడే జరుగుతుంది.. నాకింకా ఆ ఘడియలు రాలేదేమో...' అంటే వేదాంత ధోరణిలో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. 'ఓం నమో వేంకటేశాయ'..'బాహుబలి-2', 'భాగమతి', 'సింగం-3' చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.