శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : మంగళవారం, 4 జూన్ 2019 (14:46 IST)

జేజమ్మగారి వెయిట్‌లాస్ బుక్

లావుగా ఉన్నారా... లావు, బరువు తగ్గాలనుకుంటున్నారా... కాస్త వెయిట్ చేయండి... తొందర పడి ఏదో ఒక స్లిమ్మింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరిపోకండి. ఇటీవలి కాలంలో బరువు తగ్గిన టాలీవుడ్ జేజమ్మ తన స్వానుభవాన్ని మరియు తాను బరువు తగ్గేందుకు వాడిన విధానాలను గురించి ఒక పుస్తకం రాసేయబోతోందట. అది చదివి తెలుసుకొని బరువు తగ్గించుకునేయొచ్చు.
 
వివరాలలోకి వెళ్తే, సైజ్ జీరో సినిమా కోసం అతిగా బరువు పెరిగిపోయి... దాదాపు తెరమరుగై పోయిందని అందరూ భావించిన అనుష్క ఇప్పుడు రెండు మూడేళ్లపాటు శ్రమించిన తర్వాత తన కష్టానికి ఫలితంగా తాజాగా తన పాత రూపాన్ని పొందింది. కాగా... ఈవిడ తాను బరువు తగ్గేందుకు వాడిన పద్ధతులను, దానికి సంబంధించిన తన అనుభవాలను ఒక పుస్తకంగా రాయబోతోందట. అయితే... ఈ పుస్తకం ఇంగ్లీషులో ఉండబోతోంది.