మనస్సుకు నచ్చితే ఏ పాత్రైనా ఓకే - ప్రియాంక జవాల్కర్
విజయ్ దేవరకొండ హీరోగా 2018లో వచ్చిన "టాక్సీవాలా" చిత్రంతో ప్రియాంక జవాల్కర్ కు మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా ఓ తమిళ సినిమాలో నటిస్తోంది. ఎస్.ఆర్. కళ్యాణమండపం, తిమ్మరుసు వంటి సినిమాలు చేసిన ఆమె తాజాగా ఓ ప్రముఖ సంస్థ నిర్మించనున్న సినిమాలో నటించేందుకు ఫొటో షూట్ చేసింది. వాటిని తన సోషల్మీడియాలో పోస్ట్ చేసింది.
ఇటీవల ఓ సందర్భంలో ఆమె మాట్లా3డుతూ, తను చేస్తున్న పాత్రల గురించి కదిలిస్తే..”నాకు ఎన్నో పాత్రలు లభిస్తున్నాయి. అయితే.. ఏదైనా మనసుకు నచ్చితేనే చేస్తున్నా నన్ను చాలా మంది వివిధ రకాలుగా ప్రశ్నిస్తున్నారు.. గ్లామర్ పైనే మోజు ఎందుకని? గ్లామర్ రోల్స్ అనేవి సినిమాకు ప్లస్ అవుతున్నాయిగా. ఏ వయసులో చేయాల్సిన పాత్రలు ఆ వయసులోనే చేస్తే బావుంటుంది. వయసు పైబడ్డాక గ్లామర్ రోల్స్ చేస్తే చూస్తారా అంటూ తెలివిగా చెబుతోంది ప్రియాంక.