యు ఆర్ ది బెస్ట్ అంటోన్న చార్మి ఎవరినో తెలుసా!
డైనమిక్ లేడీ ఛార్మి కౌర్ ఏది చేసినా ధైర్యంగా చెప్పేస్తుంది. పూరీ జగన్నాథ్‌తో కలిసి సినిమాలు నిర్మిస్తోంది. విజయ్ దేవరకొండతో ఆమె `లైగర్` సినిమా చేస్తోంది. కొంత కాలం షూట్ చేశాక లాక్‌డౌన్ జరిగాక ఇంటిలో వున్న ఆమె తనకు పెట్స్ అంటే విపరీతమైన ఇష్టమని తెలియజేస్తూ పిక్స్ కూడా పోస్ట్ చేసింది. విదేశీ జాతికి చెందిన కుక్కతో తను సోఫాలో పడుకుని వున్న ఫొటోనూ ఆమధ్య పోస్ట్ చేసింది. చాలా మెత్తగా వుండే ఆ జాతి కుక్కను వాటేసుకుని పడుకుని యు ఆర్ ది బెస్ట్ అంటూ కామెంట్ పెట్టింది. ఆమె ఇంటిలో నాలుగు వివిధ జాతులకు చెందిన కుక్కపిల్లలుకూడా వున్నాయి. ఇక పూరీ జగన్నాథ్‌కూ పెంపుడుకుక్కలంటే ప్రీతి. వాటిలో శ్రేష్టమైన జాతిని తీసుకువచ్చి ఆయన పెంచుకుంటుంటాడు.
ఇప్పుడు ఆ కోవలోనే రష్మిక మండోన్నా చేరింది. ఆమెకూ పెట్స్ అంటే విపరీతమైన అభిమానం కూడా. ఇటీవలే ముంబైలో చార్మి, రష్మిక కలిసిన సందర్భంగా పెట్స్‌తో ఆడుకుంటూ ఇలా కనిపించారు. వాటిని తన సోషల్‌మీడియాలో పెట్టుకుని మురిసిపోయింది చార్మి. మనస్సు అందమైన బానిస. కానీ చాలా ప్రమాదకరమైన మాస్టర్ అంటూ కేప్టస్ పెట్టింది. విశేషం ఏమంటే బోర్‌కొట్టినప్పుడల్లా ఆ ఫీల్ దగ్గరకు రానీయకుండా పెట్స్‌తోనూ ఆడుకుంటూ వుంటారు. రాత్రి పూట ఇద్దరూ పెట్స్‌ను తమ వద్దే నిద్రపుచ్చుకుంటారు. దీనిపై చార్మి అభిమానులు రకరకాలుగా స్పందించారు. మరికొందరు మనస్సుకు పిల్లలు, పెట్స్ ఇద్దరూ మంచి రీలీఫ్ అంటున్నారు.