సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 4 జులై 2024 (12:58 IST)

ఓజీ.. ఓజీ అని వెళితే... ప్రజలు క్యాజీ అంటూ ప్రశ్నిస్తారు : పవన్ కళ్యాణ్

pawan kalyan
ఓజీ ఓజీ అని సినిమా షూటింగులకు వెళితే ప్రజలు క్యాజీ అని ప్రశ్నిస్తారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అందువల్ల ఇపుడు సినిమాలు చేసే సమయం ఉందా అని ప్రశ్నించారు. ఏపీ ప్రజలకు సేవ చేసుకునే అవకాశమివ్వాలని నిర్మాతలకు విజ్ఞప్తి చేశారు. మూడు నెలల తర్వాత సినిమా షూటింగుల కోసం నెలలో మూడు నాలుగు రోజుల సమయం కేటాయిస్తానని తెలిపారు. 
 
తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'సినిమాలు చేసే టైమ్ ఉంటుందంటారా? ఎలాగూ మాటిచ్చాం కాబట్టి ముందు ఒప్పుకున్న సినిమాలు చేయాలి. కానీ కనీసం గుంతలైనా పూడ్చకుండా సినిమాల కోసం వెళితే ప్రజలు నన్ను తిట్టుకుంటార'ని అన్నారు.
 
తాను సినిమాలు చేయడానికి వెళ్తే... కనీసం కొత్త రోడ్లు వేయకున్నా, గుంతలు కూడా పూడ్చలేదని ప్రజలు తిడతారన్నారు. గెలిపించిన ప్రజలు తిట్టకుండా చూసుకోవాలి కదా అన్నారు. నేను 'ఓజీ... ఓజీ' అని వెళితే ప్రజలు తనను 'క్యాజీ' అని సమస్యలపై ప్రశ్నిస్తారని సరదాగా వ్యాఖ్యానించారు. 
 
మా ఆంధ్ర ప్రజలకు కనీసం సేవ చేసుకునే అవకాశం ఇవ్వాలని ఆయన నిర్మాతలకు విజ్ఞప్తి చేశారు. మూడు నెలల పాటు సినిమాల షూటింగులకు దూరంగా ఉంటానని చెప్పారు. వీలున్నప్పుడు రెండు మూడు రోజులు షూటింగ్ కోసం సమయం కేటాయిస్తానన్నారు. తన పనికి అంతరాయంకాకుండా ముందుకు సాగుతానన్నారు. నిర్మాతలకు ఆయన క్షమాపణలు చెప్పారు. 'ఓజీ చూద్దురుగానీ... బాగుంటుంద'ని అభిమానులను ఉద్దేశించి పవన్ నవ్వుతూ అన్నారు.