సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 30 ఏప్రియల్ 2022 (09:39 IST)

మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఏపీ మంత్రి ఆర్.కె.రోజా ఫ్యామిలీ

rk roja - chiru
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖామంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సినీ నటి ఆర్.కె.రోజా శుక్రవారం మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. హైదరాబాద్ నగరంలోని చిరంజీవి నివాసానికి వెళ్లిన మంత్రి రోజా, ఆమె భర్త, సినీ దర్శకుడు ఆర్.కె.సెల్వమణి, వారిద్దరి పిల్లలను దంపతులకు చిరంజీవి, సురేఖ దంపతులు సాదర స్వాగతం పలికారు. 
 
చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ నటించిన "ఆచార్య" చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. దీంతో చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజాను చిరంజీవి అభినందించారు. ఈ సందర్భంగా రోజాకు శాలువా కప్పి సన్మానించారు. 
 
అంతకుముందు ముందు రోజా తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కూడా ఆయన అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌లో కలుసుకున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇటు చిరంజీవి, అటు సీఎం కేసీఆర్‌ను రోజా కలుసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.