గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 5 అక్టోబరు 2017 (12:47 IST)

చిరంజీవికి ఏఆర్ రెహ్మాన్ షాక్... 'సైరా'కు గుడ్ బై

మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మించనున్న 151వ చిత్ర యూనిట్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈ చిత్రం నుంచి సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ తప్పుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మించనున్న 151వ చిత్ర యూనిట్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈ చిత్రం నుంచి సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ తప్పుకున్నారు. ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నందున "సైరా నరసింహా రెడ్డి" చిత్రానికి సంగీత బాణీలు సమకూర్చలేనని రెహ్మాన్ తేల్చి చెప్పినట్టు ఫిల్మ్ నగర్‌లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. 
 
కాగా, ఈ చిత్రాన్ని హీరో రాంచరణ్ నిర్మించనుండగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. నిజానికి ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా థమన్‌ను తీసుకుందామని అనుకున్నారు. వివిధ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనే నిర్ణయానికి రావడంతో, జాతీయస్థాయి మార్కెట్ కోసం ఏ.ఆర్.రెహ్మాన్‌ను ఎంపిక చేసుకున్నారు.
 
అయితే రెహ్మాన్ ఈ సినిమా చేస్తున్నాడా? లేదా? అనే విషయంలో కొన్ని రోజులుగా ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది. ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టేననేది తాజా సమాచారం. సహజంగానే రెహ్మాన్ ఏ ప్రాజెక్టుకైనా ఎక్కువ సమయాన్ని తీసుకుంటూ ఉంటాడు. 
 
అందువల్లనే తక్కువ సినిమాలను అంగీకరిస్తూ ఉంటాడు. ఇటీవలే 'బ్రూస్ లీ' బయోపిక్‌కు సంగీతం సమకూర్చేందుకు అంగీకరించడంతో 'సైరా' నుంచి తప్పుకున్నట్టు సమాచారం. దీంతో థమన్‌కే సంగీత బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.