శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 22 డిశెంబరు 2018 (16:58 IST)

''మీటూ'' మాట్లాడటం పబ్లిసిటీ కోసం పాకులాడటమే.. అరవింద్ స్వామి

దేశ వ్యాప్తంగా మీటూ ఉద్యమం ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై తాజాగా కోలీవుడ్ అందాల హీరో అరవింద్ స్వామి నోరు విప్పాడు. ప్రస్తుతం సోషల్ మీడియా అందరికీ అందుబాటులో వుండటంతో మీటూ గురించి మాట్లాడుతూ.. పబ్లిసిటీ దక్కించుకుంటున్నారని చెప్పారు.


తొలుత తనకేం సంబంధం వుందని ఈ ప్రశ్న అడుగుతున్నారని ఓ ఇంటర్వ్యూలో అరవింద్ స్వామి ఎదురుప్రశ్న వేశారు. ఒకవేళ మీటూపై సమాధానం చెబితే తనకు పబ్లిసిటీ రావడం తప్ప మరేమీ వుండదని చెప్పారు. 
 
అంతేగాకుండా మీటూకి మద్దతు తెలుపుతున్నట్లుగా వారికి వారు పబ్లిసిటీ సంపాదించుకుంటున్నారు. అవతలి వారి సమస్యను అడ్డుపెట్టుకుని ఈ పబ్లిసిటీ అవసరమా అంటూ ప్రశ్నించారు. ఇది చాలా పెద్ద తప్పన్నారు. ఇంకా చిన్మయి వివాదంపై కూడా అరవింద్ స్వామి స్పందించారు. చిన్మయి కొందరిని విమర్శించింది. అందుకని అందరూ వాళ్లను విమర్శించాల్సిన పనిలేదు.
 
దానికి తగినంత సమాచారం వుంటే అప్పుడు ఆలోచించాలి. ఎవరికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు వారు చెప్పుకోవచ్చు కానీ.. ఇతరుల విషయంలో తలదూర్చి పబ్లిసిటీ కోసం పాకులాడటమే తప్పని అరవింద్ స్వామి చెప్పారు.