సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 9 జూన్ 2021 (16:00 IST)

మీరు వేక్సిన్ కు రెడీనా అంటోన్న‌ ఎ.ఆర్‌. రెహ‌మాన్‌

A.R. Rahman, Hameen
కోవిడ్ వేక్సిన్‌ను దాదాపు సినిమా రంగంలోని ప్ర‌ముఖులంతా వేయించుకుంటున్నారు. మొద‌టి విడ‌త‌గా ప‌లువురు సెల‌బ్రిటీలు తీసుకున్నారు. అందులో సంగీత ప్ర‌పంచానికి దిగ్గ‌జంలాంటివాడు ఎ.ఆర్‌. రెహ‌మాన్‌. తాను మొద‌టి విడ‌త టీకా వేయించుకున్న‌ట్లు త‌న సోష‌ల్‌మీడియాలో వెల్ల‌డించారు. త‌న కుమారుడు హ‌మీన్‌తో క‌లిసి కోవీ షీల్డ్ టీకా చెన్న‌య్‌లో వేసుకున్నాన‌ని తెలియ‌జేశారు. ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా టీకా అవ‌స‌రం అని అంద‌రూ దీనిని పాటించాల‌ని పేర్కొంటున్నారు. తండ్రీ కొడుకులు తెల్ల‌టి మాస్క్ ధ‌రించి వున్న ఫొటోను పోస్ట్ చేశారు.
 
నా టీకా పూర్త‌యింది. మ‌రి మీరు రెడీనా! అంటూ అభిమానుల‌ను ఎంక‌రేజ్ చేస్తూ పోస్ట్ పెట్టాడు. దీనిపై ఆయ‌న అభిమానులు విప‌రీతంగా స్పందిస్తున్నారు. మేము కూడా త్వ‌ర‌గా టీకా తీసుకుంటామ‌ని పేర్కొన్నారు. అయితే టీకా తీసుకున్నాక కొద్దిరోజులు జాగ్ర‌త్త‌గా వుండాల‌ని ఆయ‌న‌కు కొంద‌రు సూచించారు. ఆయ‌న‌కు ప్ర‌ముఖులు కూడా విషెస్ తెలిపారు. కాగా, ఎ.ఆర్‌. రెహ‌మాన్ నిర్మాత‌గా మారి ర‌చ‌న కూడా చేసి నిర్మించిన సినిమా `99 సాంగ్స్‌`. ఇందులో అంద‌రూ కొత్త‌వారే. ఈ సినిమా ప‌లు భాష‌ల్లో విడుద‌ల‌చేయాల‌ని ప్లాన్ చేశారు. క‌రెక్ట్‌గా కోవిడ్ సెకండ్‌వేవ్ టైంలో కొన్నిచోట్ల మాత్ర‌మే థియేట‌ర్ల‌లో విడుద‌ల చేశారు. అందుకే నెట్‌ప్లిక్స్‌లో అనంత‌రం విడుద‌ల చేశారు.