శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 3 జులై 2015 (18:46 IST)

బాహుబలి ప్రమోషన్ ఓ వైపు.. ఆర్యతో అనుష్క లవ్వాయణం మరోవైపా?

బాహుబలి సినిమా ప్రమోషన్‌లో భాగంగా బిజీ బిజీగా గడుపుతున్న అనుష్క.. ప్రస్తుతం ఆరడుగుల అందగాడు.. పర్ణ హీరో ఆర్యతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుందని కోలీవుడ్ కోడై కూస్తోంది.

పర్ణ సినిమానే వీరిద్దరి మధ్య ప్రేమను చిగుర్చిందని టాక్ వస్తోంది. ప్రస్తుతం ఈ జంట పర్ణ తర్వాత '' ఇంజి  ఇడుప్పళగి''లో కలిసి నటిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో పర్ణ సినిమాకు తర్వాత వీరిద్దరూ రహస్యంగా మీడియాకు చిక్కకుండా కలుసుకునేవారని సమాచారం. అయితే కొద్దికాలం ప్రేమకు బ్రేక్ వేసిన ఆర్య-అనుష్క ఇంజి ఇడుప్పళగి షూటింగ్‌లో పాల్గొనడం ద్వారా మళ్లీ కలుసుకునే ఛాన్స్ వచ్చిందని హ్యాపీగా ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది.